Leopard Viral Video: రాత్రి వేళ సంబరాల్లో యువతీయువకులు.. అర్ధరాత్రి రోడ్డు మధ్యలో షాకింగ్ సీన్.. చివరకు..
ABN , Publish Date - Oct 15 , 2025 | 10:51 AM
కొందరు యువతీయువకులు వాహనాల్లో రాత్రి వేళ్ల అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రాత్రి వేళ అంతా కలిసి డాన్సులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. యువతులు గదిలో డాన్సులు చేస్తుండగా.. యువకులంతా కలిసి వాహనంలో..
యువత వేడుకలు చేసుకునే తీరు రోజు రోజుకూ మారుతోంది. పుట్టిన రోజు వచ్చిందంటే.. రోడ్డుపై వాహనాలు ఆపడం, అక్కడే కేకులు కట్ చేసి రచ్చ రచ్చ చేయడం చూస్తుంటాం. మరికొందరు నైట్ క్యాంపింగ్ పేరుతో తమ సరదాలు తీర్చుకుంటుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం అందరి వద్దా స్మార్ట్ ఫోన్లు ఉండడంతో ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు యువతీయువకులు రాత్రి సమయంలో రోడ్డుపై సంబరాలు చేసుకుంటుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువతీయువకులు వాహనాల్లో రాత్రి వేళ్ల అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రాత్రి వేళ అంతా కలిసి డాన్సులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. యువతులు గదిలో డాన్సులు చేస్తుండగా.. యువకులంతా కలిసి వాహనంలో అడవి మధ్యలో రోడ్డుపైకి వచ్చేశారు. అక్కడ డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేశారు.
ఇలా అంతా సరదాగా ఉండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ సింహం రోడ్డు దాటడం (Lion crossing the road) చూసి అంతా షాక్ అయ్యారు. అంతా కలిసి భయంతో కారులోకి ఎక్కేశారు. సింహం దూరంగా రోడ్డు దాటి వెళ్లిపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అబ్బాయిలకు అమ్మాయిలతో తప్ప.. సింహాలతో సమస్య లేదు’.. అంటూ కొందరు, ‘పెద్ద ప్రమాదం తృటిలో తప్పిపోయిందిగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3,600కి పైగా లైక్‌లు, 1.43 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
రైలు ఎక్కుతూ ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయాడు.. తీరా చూస్తే షాకింగ్ సీన్..
దేశంలో అత్యంత 5 ప్రమాదకరమైన గ్రామాలివే.. ఇక్కడ అడుగుపెడితే ఏమవుతుందో తెలుసా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి