Watch Viral Video: పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Oct 22 , 2025 | 03:16 PM
ఓ వ్యక్తి తన ప్యాంట్ జేబులో నుంచి పర్సు బయటికి తీశాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. పర్సు బయటికి తీయడంలో విశేషమేమీ లేకున్నా.. దాన్ని ఓపెన్ చేయగానే లోపలి దృశ్యం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. పర్సు తెరవగానే ..
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చాలా మంది వారి వారి టాలెంట్‌కు పదును పెట్టి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం చూస్తున్నాం. కొందరైతే ఎవరూ చేయని విధంగా వింత వింత ఆవిష్కరణలు చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పర్సును ఫోన్‌లా మార్చేయడం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. వావ్.. టాలెంట్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ప్యాంట్ జేబులో నుంచి పర్సు బయటికి తీశాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. పర్సు బయటికి తీయడంలో విశేషమేమీ లేకున్నా.. దాన్ని ఓపెన్ చేయగానే లోపలి దృశ్యం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. పర్సు తెరవగానే ఓ వైపు కీప్యాడ్ (Keypad) బోర్డును, మరో వైపు కీప్యాడ్ ఫోన్ స్ర్కీన్‌ను సెట్ చేశాడు.
పర్సు మొత్తం తెరచి చూడగా.. అలాంటి స్క్రీన్లను (Keypad phone screen in purse) మొత్తం మూడింటిని వరుసగా సెట్ చేశాడు. సెట్ చేయడమే కాదు.. వాటికి రెండు సిమ్‌లను (Dual SIM) కూడా కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేయడమే కాదండోయ్.. అవన్నీ పని చేస్తున్నాయి కూడా. మన కళ్ల ముందే ఆ వ్యక్తి కీప్యాడ్‌పై ప్రెస్ చేసి, కాల్ కూడా చేశాడు. ఇలా పర్సులో ఫోన్ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి అంతా అవాక్కయ్యేలా చేస్తున్నాడు. ఈ వ్యక్తి చేసిన వినూత్న ఆవిష్కరణ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి ప్రయోగం ఎక్కడా చూడలేదు’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 91వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
టికెన్ కొని మెట్రో ఎక్కాడు.. లోపల అతడు చేసిన పనికి అంతా షాక్..
రాత్రి వేళ సంబరాల్లో యువతీయువకులు.. అర్ధరాత్రి రోడ్డు మధ్యలో షాకింగ్ సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి