Share News

Lawyer Viral Video: వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండగానే.. లాయర్ వింత ప్రవర్తన.. మహిళను దగ్గరికి లాక్కుని..

ABN , Publish Date - Oct 17 , 2025 | 08:32 AM

న్యాయవాదులు మొత్తం వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. అంతా వారి వారి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఆన్ చేసుకుని కెమెరాల ఎదురుగా కూర్చున్నారు. కాసేపు ఆగితే కాన్ఫరెన్స్‌లోకి జడ్జి హాజరవుతారు. అయితే ఇంతలో ఓ లాయర్ చేసిన పనికి అంతా అవాక్కయ్యారు..

Lawyer Viral Video: వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండగానే.. లాయర్ వింత ప్రవర్తన.. మహిళను దగ్గరికి లాక్కుని..

పోలీసులు, లాయర్లకు సమాజంలో ఉన్నత స్థానం ఉంది. ఏదైనా సమస్య వస్తే.. వారి వద్దకు వెళ్తే పరిష్కారం అవుతుందనే దైర్యం ఉంటుంది. అయితే ఇలాంటి వృత్తిలో ఉన్న వారిలో చాలా మంది అందుకు నిదర్శనంగా నిలుస్తుంటారు. అయితే కొందరు మాత్రం తమ వికృత చేష్టలతో ఆ వృత్తికే చెడ్డపేరు తెస్తుంటారు. బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేసే వారు కొందరైతే.. మరికొందరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉండడంతో ఇలాంటి వారి వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. హైకోర్టుకు సంబంధించిన లాయర్లు మొత్తం వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. ఈ సమయంలో ఓ లాయర్ చేసిన పనికి అంతా అవాక్కయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు వర్చువల్ ప్రొసీడింగ్స్‌లో (Virtual Proceedings) పాల్గొన్నారు. అంతా వారి వారి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఆన్ చేసుకుని కెమెరాల ఎదురుగా కూర్చున్నారు. కాసేపు ఆగితే కాన్ఫరెన్స్‌లోకి జడ్జి హాజరవుతారు. అయితే ఇంతలో ఓ లాయర్ చేసిన పనికి అంతా అవాక్కయ్యారు. కెమెరా ముందు వీల్ చైర్‌లో కూర్చున్న ఆ లాయర్.. కాసేపు హుందాగానే ఉన్నారు.


ఇంతలో ఓ మహిళ అతడి వద్దకు వచ్చి నిలబడింది. ఆమెను చూడగానే ఆ లాయర్.. చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా (Lawyer kissed woman) ఆమెను ముద్దు కూడా పెట్టుకున్నాడు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులను.. ఇలా లైవ్ కాన్ఫరెన్స్‌లో కెమెరా ముందే చేసేశాడు. ఇతడి నిర్వాకం చూసి మిగతా లాయర్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఇది నిజం కాదు ఏఐ క్రియేషన్ అంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు.


ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘గౌరవప్రదమైన వృత్తిలో ఉండి.. ఇలా ప్రవర్తించడం పద్ధతి కాదు’.. అంటూ కొందరు, ‘వీడియో కాన్ఫరెన్స్‌లో లాయర్ ఇలా చేయడమేంటీ.. ఇది నిజమా లేక గ్రాఫిక్సా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 వేలకు పైగా లైక్‌లు, 2.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

టికెన్ కొని మెట్రో ఎక్కాడు.. లోపల అతడు చేసిన పనికి అంతా షాక్..

రాత్రి వేళ సంబరాల్లో యువతీయువకులు.. అర్ధరాత్రి రోడ్డు మధ్యలో షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 17 , 2025 | 09:00 AM