Car Funny Video: కారు వెనుక విచిత్ర సందేశం.. ముందు వైపు ఫన్నీ సీన్.. అసలేమైందంటే..
ABN , Publish Date - Oct 16 , 2025 | 09:51 AM
రోడ్డు పక్కన ఓ కారు ఆగి ఉంది. దాని వెనుక ఇలా రాసి ఉంది. ‘వెనుక ఎవరూ ఢీకొనవద్దు.. నా వద్ద కర్ర ఉంది’.. అంటూ ఆ కారు యజమాని హెచ్చరిక సందేశాన్ని రాశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది..
కొన్నిసార్లు కొందరికి ఎదురయ్యే సమస్యలు ఎదుటివారికి తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో జాలిపడాల్సింది పోయి.. అంతా పక్కున నవ్వుకుంటుంటారు. మరికొన్నిసార్లు ఎదుటివారికి హెచ్చరికలు జారీ చేసే వారికి చివరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రమాదానికి గురైన కారును చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఓ కారు ఆగి ఉంది. దాని వెనుక ఇలా రాసి ఉంది. ‘వెనుక ఎవరూ ఢీకొనవద్దు.. నా వద్ద కర్ర ఉంది’.. అంటూ ఆ కారు యజమాని హెచ్చరిక సందేశాన్ని రాశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. కారు దగ్గరికి వెళ్లిన కెమెరామెన్.. మెల్లిగా కారు ముందు వైపునకు వెళ్లాడు.
చివరకు ముందు వైపు చూడగా.. (Damaged car engine) కారు ఇంజిన్ మొత్తం నుజ్జునుజ్జయింది. పరిస్థితి చూస్తుంటే ఈ కారు డ్రైవర్.. దేన్నే బలంగా ఢీకొట్టడమే.. లేదా వేరే వాహనం ఎదురుగా వచ్చి ఈ కారును ఢీకొట్టడమో జరిగినట్లు అనిపిస్తోంది. ఎవరూ ఢీకొట్టవద్దు అంటూ వెనుక సందేశాన్ని రాయడమే అంతా నవ్వుకోవడానికి కారణమైంది. వెనుక ఎవరూ ఢీకొట్టవద్దు అని రాయడంతో.. (Warning message behind the car) ముందు వైపు ఢీకొట్టారంటూ చూసిన వారంతా.. నవ్వుకుంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అరెరే.. పెద్ద కష్టమే వచ్చిందే’.. అంటూ కొందరు, ‘వెనుక వద్దన్నాడని.. ముందు ఢీకొట్టారు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 75 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
టికెన్ కొని మెట్రో ఎక్కాడు.. లోపల అతడు చేసిన పనికి అంతా షాక్..
రాత్రి వేళ సంబరాల్లో యువతీయువకులు.. అర్ధరాత్రి రోడ్డు మధ్యలో షాకింగ్ సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి