Cheetah In Jungle Safari: జంగిల్ సఫారీలో ఫొటోగ్రాఫర్లకు షాక్.. ఫొటోలు తీస్తుండగా పక్కనే చిరుత.. చివరకు..
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:07 PM
కొందరు ఫొటోగ్రాఫర్లు వాహనాల్లో జంగిల్ సఫారీకి వెళ్లారు. అడవిలో చక్కర్లు కొడుతూ తమ కంటికి కనిపించే దృశ్యాలను క్లిక్‌మనిపిస్తున్నారు. ఇంతలో వారికి దూరంగా చిరుత పులులు కనిపించాయి. వాటిని ఫొటోలు తీస్తుండగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
జంగిల్ సఫారీ అంటే ఇష్టపడని వారుండరు. అడవి మధ్యలో క్రూరమృగాల మధ్యలో నుంచి వెళ్లడమే కాకుండా వాటిని అతి దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే అడవిలోని అద్భుత దృశ్యాలను వీక్షించే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే కొన్నిసార్లు అదే స్థాయిలో ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. పులులు, సింహాలు.. వాహనాలను చుట్టుముట్టడం ఒక ఎత్తైతే.. కొన్నిసార్లు అవి మనుషులు గాయపడడం కూడా జరుగుతుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు ఫొటోగ్రాఫర్లు (Photographers) వాహనాల్లో జంగిల్ సఫారీకి (Jungle Safari) వెళ్లారు. అడవిలో చక్కర్లు కొడుతూ తమ కంటికి కనిపించే దృశ్యాలను క్లిక్‌మనిపిస్తున్నారు. ఇంతలో వారికి దూరంగా చిరుత పులులు కనిపించాయి. దీంతో వాహనాన్ని గడ్డిలో ఆపి.. కిందకు దిగారు. వాహనం పక్కనే కూర్చున్న ఇద్దరు ఫొటోగ్రాఫర్లు కాస్త దూరంలో ఉన్న చిరుతను ఫొటోలు తీస్తుంటారు.
అక్కడున్న ఇద్దరు ఫొటోగ్రాఫర్లలో ఓ మహిళ కూడా ఉంటుంది. వారు ఫొటోలు తీస్తుండగా.. మరో చిరుత (Leopard) వచ్చి వారి పక్కనే నిలబడుతుంది. కాసేపట తర్వాత ఫొటోలు తీస్తున్న మహిళ దృష్టి.. ఆ చిరుతపై పడుతుంది. చిరుతను ఫొటో తీస్తున్న ఆమె.. పక్కనే మరో చిరుత ఉండడం చూసి షాక్ అవుతుంది. అయితే ఆ చిరుత వారికి ఎలాంటి హానీ చేయకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘లక్ష్యంపై దృష్టి పెట్టడం ఎంత ముఖ్యంపై.. వెళ్తున్న మార్గాన్ని పరిశీలించడం కూడా అంతే ముఖ్యం’.. అంటూ కొందరు, ‘వీళ్ల అదృష్టం బాగుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 88 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
టికెన్ కొని మెట్రో ఎక్కాడు.. లోపల అతడు చేసిన పనికి అంతా షాక్..
రాత్రి వేళ సంబరాల్లో యువతీయువకులు.. అర్ధరాత్రి రోడ్డు మధ్యలో షాకింగ్ సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి