Share News

Langur Attacks Biker: వీధి రౌడీలా మారిన కోతి.. బైకర్‌పై దాడి..

ABN , Publish Date - Oct 13 , 2025 | 05:03 PM

ఆ కోతి అతడ్ని చూసింది. దానికి ఏమైందో ఏమో తెలీదు కానీ, బైకును వెంబడించింది. బైకును చేరుకుని రైడర్‌ను ఎగిరి తన్నింది. దీంతో రైడర్ బైకుతో సహా రోడ్డుపై పడిపోయాడు.

Langur Attacks Biker: వీధి రౌడీలా మారిన కోతి.. బైకర్‌పై దాడి..
Langur Attacks Biker

ఓ వీధి కోతి బైక్ రైడర్‌పై రెచ్చిపోయింది. వెంటాడి మరీ అతడిపై దాడి చేసింది. కోతి ఎగిరి తన్నటంతో బైకుపై నుంచి దూరంగా ఎగిరిపడ్డాడు. గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. డుమ్కా జిల్లాలో ఓ కోతి నడిరోడ్డుపై కూర్చుని ఉంది. కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి బైకుపై దాని పక్క నుంచి ముందుకు వెళ్లాడు.


ఆ కోతి అతడ్ని చూసింది. దానికి ఏమైందో ఏమో తెలీదు కానీ, బైకును వెంబడించింది. బైకును చేరుకుని రైడర్‌ను ఎగిరి తన్నింది. దీంతో రైడర్ బైకుతో సహా రోడ్డుపై పడిపోయాడు. బాగా గాయాలు అయ్యాయి. దాడి చేసిన తర్వాత ఆ కోతి అక్కడి నుంచి పరుగులు తీసుకుంటూ వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నందుకు ఆ కోతి వేసిన శిక్ష’..‘ఆ వ్యక్తిపై అది ఎందుకలా దాడి చేసిందో దానికే తెలియాలి’..


‘ఈ మధ్య కాలంలో ఊర్లలో కోతుల బెడద బాగా ఎక్కువైపోయింది. జనాలపై విపరీతంగా దాడులు చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు అస్సలు పట్టించుకోవటం లేదు’..‘ఈ నల్లమూతి కోతులు చాలా కోపంగా ఉంటాయి. అందరి మీదా దాడి చేస్తుంటాయి’..‘ఇలాంటి వీడియోలు చూస్తే ఓ వైపు నవ్వు వస్తుంది. మరో వైపు బాధ కూడా వేస్తుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

శవాలతోటే జీవనం.. టోరజా జాతి గురించి తెలుసా?..

షాకింగ్ యాక్సిడెంట్.. బైక్ కోసం ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు..

Updated Date - Oct 13 , 2025 | 05:09 PM