UP man train accident: షాకింగ్ యాక్సిడెంట్.. బైక్ కోసం ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు..
ABN , Publish Date - Oct 13 , 2025 | 03:38 PM
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఆదివారం షాకింగ్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ఆ ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దాద్రి నివాసి తుషార్ తన బైక్‌పై రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఆదివారం షాకింగ్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ఆ ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దాద్రి నివాసి తుషార్ తన బైక్‌పై రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తుషార్ రైల్వే ట్రాక్ సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది (Railway crossing accident).
ట్రాక్ మీద బైక్ పడిపోయింది. తుషార్ కాస్త దూరంగా పడ్డాడు. అప్పటికే రైలు వేగంగా వస్తోంది. అయితే తుషార్ పట్టాల మీద ఉన్న తన బైక్‌ను తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ బైక్‌ను సులభంగా తీయలేకపోయాడు. అప్పటికే రైలు వేగంగా అక్కడకి వచ్చేసింది. చివరి నిమిషంలో బైక్‌ను వదిలేసి తుషార్ పరిగెత్తడానికి ప్రయత్నించాడు. అయితే వేగంగా వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది (man run over by train).
దీంతో తుషార్ రైలు కింద పడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు (bike accident on railway track). 19 ఏళ్లు తుషార్‌కు పెళ్లి ఫిక్స్ అయింది. నవంబర్ నెలలో అతడి పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కాగా, రైలు ప్రమాదాలు ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువయ్యాయి.
ఇవి కూడా చదవండి..
అదృష్టం అంటే ఇదే.. పెద్ద ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుందో చూడండి..
పాము అంటే పులికీ భయమే.. ఎలా వెనకడుగు వేసిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..