Share News

shocking video: అదృష్టం అంటే ఇదే.. పెద్ద ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుందో చూడండి..

ABN , Publish Date - Oct 12 , 2025 | 05:50 PM

అదృష్టం ఉంటే సముద్రం మధ్యలో పడినా ఎలాగోలా ఒడ్డుకు వచ్చేస్తామనేది సామెత. అదృష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా సునాయాసంగా బయటపడవచ్చు. ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు.

shocking video: అదృష్టం అంటే ఇదే.. పెద్ద ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుందో చూడండి..
woman escapes accident

అదృష్టం ఉంటే సముద్రం మధ్యలో పడినా ఎలాగోలా ఒడ్డుకు వచ్చేస్తామనేది సామెత. అదృష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా సునాయాసంగా బయటపడవచ్చు. ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా మన కళ్ల ముందుకు వచ్చాయి. తాజాగా మరో షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (unbelievable escape).


@cctv_idiots అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన భర్త, పెంపుడు కుక్కతో కలిసి ఇంటి బయట విహరిస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఓ భారీ వృక్షం నేలకొరిగింది. ఆ భారీ వృక్షం ఆమె ఉన్న చోటే పడింది. అయితే సరిగ్గా చెట్టు కొమ్మల మధ్యలో ఆ మహిళ ఉండిపోయింది. దీంతో ఆమెకు ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు. ఆమె భర్త, పెంపుడు కుక్క కూడా క్షేమంగానే బయటపడ్డారు (woman escapes accident).


ఒకవేళ ఆ చెట్టు ఆమె మీద పడి ఉంటే కచ్చితంగా తీవ్రంగా గాయపడి ఉండేది (near miss accident). ఆ ఘటన ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కొన్ని వేల మంది ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలు తెలియజేశారు. ఆమె నిజంగా చాలా అదృష్టవంతురాలు అని కొందరు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

ఏనుగు vs ఖడ్గమృగం.. ఈ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..


మీకు కశ్మీర్ ఇస్తే ఏం చేసుకుంటారు.. పాకిస్థాన్ టోల్ ప్లాజాపై నెటిజన్ల సెటైర్లు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 12 , 2025 | 05:50 PM