Elephant vs Rhino: ఏనుగు vs ఖడ్గమృగం.. ఈ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
ABN , Publish Date - Oct 11 , 2025 | 08:26 AM
ఈ భూమి మీద అత్యంత బలమైన జంతువు ఏనుగు. అత్యంత భారీ శరీరం, బలం కలిగిన ఏనుగులు సాధారణంగా సాధు జంతువులు. అనవసరంగా ఇతర జంతువుల జోలికి వెళ్లవు. పెద్ద మనిషి తరహాలో వ్యవహరిస్తుంటాయి. అయితే ఏదైనా జంతువు తమ జోలికి వస్తే మాత్రం తగిన గుణపాఠం చెబుతాయి.
ఈ భూమి మీద అత్యంత బలమైన జంతువు ఏనుగు. అత్యంత భారీ శరీరం, బలం కలిగిన ఏనుగులు సాధారణంగా సాధు జంతువులు. అనవసరంగా ఇతర జంతువుల జోలికి వెళ్లవు. పెద్ద మనిషి తరహాలో వ్యవహరిస్తుంటాయి. అయితే ఏదైనా జంతువు తమ జోలికి వస్తే మాత్రం తగిన గుణపాఠం చెబుతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ ఖడ్గ మృగం, ఏనుగు తలపడ్డాయి (animal fight).
@Mothematiks అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అడవిలో ఓ భారీ ఏనుగు, ఖడ్గమృగం ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఏనుగు శరరీంతో పోల్చుకుంటే ఖడ్గమృగం దాదాపు సగం మాత్రమే ఉంది. అయినా ఆ ఖడ్గమృగం ధైర్యంగా పోరాడుతోంది. ఏనుగు ఆ రైనోను తన తొండంతో నెడుతూ వెనక్కి తోసుకెళ్లిపోయింది. ఆ రైనో తన కొమ్ములతో పొడుస్తూ ఏనుగును నిలువరించడానికి ప్రయత్నిస్తోంది. పక్కనే మరికొన్ని ఏనుగులు కూడా ఉన్నాయి. అయినా రైనో తన పోరాటాన్ని ఆపలేదు (wild animal behavior).
చివరకు ఏనుగు రైనోను వదిలేసింది. రైనో పోరాటం చూసి వెనకడుగు వేసింది (wildlife brawl). జంగిల్ సఫారీ టూరిస్ట్‌లు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు ఆరు లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు రెండు వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఖడ్గమృగం నిజమైన యోధుడిలా పోరాడిందని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈ కార్మికులు చాలా తెలివైన వాళ్లు.. బస్తాను పైకి ఎలా పంపుతున్నారో చూడండి..
ఈ ఫొటోలో రెండో కారు కూడా ఉంది.. ఎక్కడ.. 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..