Creative jugaad: ఈ కార్మికులు చాలా తెలివైన వాళ్లు.. బస్తాను పైకి ఎలా పంపుతున్నారో చూడండి..
ABN , Publish Date - Oct 09 , 2025 | 10:09 AM
మనదేశంలో సామాన్యులు కూడా అసామాన్యంగా ఆలోచిస్తారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనిపెడతారు. పెద్దగా ఖర్చు లేకుండా సునాయాసంగా పని పూర్తి చేస్తారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మనదేశంలో సామాన్యులు కూడా అసామాన్యంగా ఆలోచిస్తారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనిపెడతారు. పెద్దగా ఖర్చు లేకుండా సునాయాసంగా పని పూర్తి చేస్తారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Indian innovation).
@HamadMomin932 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ భారీ భవంతి నిర్మాణంలో ఉంది. ఆ బిల్డింగ్ మూడో ఫ్లోర్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో కింది నుంచి సిమెంట్ లేదా ఇసుక బస్తాలను మూడో అంతస్థుకు తరలించడం కాస్త కష్టంతో కూడుకున్న పని. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కార్మికులు చాలా సులభంగా ఆ పని పూర్తి చేస్తున్నారు. బస్తాలను తీసుకెళ్లాల్సిన స్థలంలో ఒక స్తంభాన్ని ఉంచి దానికి ఒక తాడును బిగించారు (viral jugaad video).
ఆ తాడు ఒక వైపును బస్తాకు కట్టారు. మరోవైపున బైక్‌కు కట్టారు. బైక్‌ను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆ బస్తా చాలా సులభంగా పైకి వెళ్లిపోతోంది (desi hack). ఈ జుగాడ్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.75 లక్షల మంది వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. జుగాడ్‌లో భారతీయులు ముందున్నారని చాలా మంది ప్రశంసలు కురిపించారు.
ఇవి కూడా చదవండి..
వావ్.. పారాసిటమాల్‌తో బట్టలు ఉతకొచ్చా.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. సీతాకోకచిలుకల మధ్యన చీమను 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..