Share News

Pakistan toll plaza: మీకు కశ్మీర్ ఇస్తే ఏం చేసుకుంటారు.. పాకిస్థాన్ టోల్ ప్లాజాపై నెటిజన్ల సెటైర్లు..

ABN , Publish Date - Oct 11 , 2025 | 01:31 PM

సమయం, సందర్భం లేకుండా భారత్‌పై కయ్యానికి కాలు దువ్వే పొరుగు దేశం పాకిస్థాన్ నాయకులు సొంత దేశంలో కనీసం మౌలిక సదుపాయాలపైనా దృష్టి సారించరు. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నా పట్టించుకోరు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియా జనాలకు విపరీతంగా నవ్వు తెప్పిస్తోంది.

Pakistan toll plaza: మీకు కశ్మీర్ ఇస్తే ఏం చేసుకుంటారు.. పాకిస్థాన్ టోల్ ప్లాజాపై నెటిజన్ల సెటైర్లు..
Pakistan toll plaza video

సమయం, సందర్భం లేకుండా భారత్‌పై కయ్యానికి కాలు దువ్వే పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan Funny Vido) నాయకులు సొంత దేశంలో కనీసం మౌలిక సదుపాయాలపైనా దృష్టి సారించరు. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నా పట్టించుకోరు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా నవ్వు తెప్పిస్తోంది. ఆ వీడియో చూస్తే అభివృద్ధిలో భారతదేశం కంటే పాకిస్థాన్ 50 సంవత్సరాలు వెనుకబడి ఉందని నమ్మక తప్పదు. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు (viral toll plaza clip).


naughtyworld అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి జాతీయ రహదారిపై టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. అతడు రోడ్డుకు అడ్డంగా కర్ర పెట్టి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. వాహనదారులు డబ్బులు చెల్లించిన తర్వాత వాహనాలు వెళ్లడానికి తన పాదంతో కర్రను పైకి ఎత్తుతున్నాడు. ఈ వీడియో చూసిన తర్వాత, పాకిస్థాన్ అభివృద్ధి పరంగా చాలా వెనుకబడి ఉందని చెప్పవచ్చు (Satire on Pakistan).


ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దాదాపు ఐదు లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. 33 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇలాంటి వ్యక్తులు కశ్మీర్‌ను కోరుకుంటున్నారని ఒకరు కామెంట్ చేశారు ( Kashmir joke). పాకిస్థానీయులతో ఏఐ కూడా పోటీపడలేదని మరొకరు కామెంట్ చేశారు. వావ్.. అద్భుతమైన టెక్నాలజీ అని మరొకరు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2025 | 04:02 PM