Tiger vs Cobra: పాము అంటే పులికీ భయమే.. ఎలా వెనకడుగు వేసిందో చూడండి..
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:25 PM
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా జంకుతారు. పాములంటే మనుషులే కాదు.. క్రూర జంతువులు కూడా భయపడతాయని తాజా వీడియో రుజువు చేస్తోంది. ఆ వీడియోలో పామును చూసి ఓ పెద్ద పులి వెనకడుగు వేసింది.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా జంకుతారు. పాములంటే మనుషులే కాదు.. క్రూర జంతువులు కూడా భయపడతాయని తాజా వీడియో రుజువు చేస్తోంది. ఆ వీడియోలో పామును చూసి ఓ పెద్ద పులి వెనకడుగు వేసింది. సాధారణంగా పెద్ద పులులు ఎలాంటి జంతువునైనా వేటాడతాయి. అలాంటిది తాజా వీడియోలో మాత్రం పులి భయపడింది (viral animal video).
thebigcatsempire అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అడవిలో రహదారిపై నీరు ప్రవహిస్తోంది. ఆ రహదారి గుండా పులి నడుచుకుంటూ వస్తోంది. దానికి ఎదురుగా పాము కనిపించింది. దాంతో పులి ఆగిపోయింది. పాము తల తిప్పి చూడగానే పులి భయపడిపోయింది. తనను తాను రక్షించుకునేందుకు రెండడుగులు వెనక్కి వేసింది. నిజానికి నాగుపాము కాటు వేస్తే పులి అయినా ప్రాణాలు కోల్పోవాల్సిందే (tiger cobra encounter).
సఫారీ టూరిస్ట్‌లు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు (viral wildlife footage). ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. నాగుపాము కాటు వేసినపుడు విషం పరిమాణాన్ని బట్టి పులి చావుబతుకులు డిసైడ్ అవుతాయి. నువ్వు ఎంత బలవంతుడివైనా, ప్రమాదానికి ఎదురెళ్లడం అవివేకం అని పులి చెబుతోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఏనుగు vs ఖడ్గమృగం.. ఈ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
మీకు కశ్మీర్ ఇస్తే ఏం చేసుకుంటారు.. పాకిస్థాన్ టోల్ ప్లాజాపై నెటిజన్ల సెటైర్లు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..