Jharkhand Gumla Encounter: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల హతం
ABN , Publish Date - Sep 24 , 2025 | 01:42 PM
గుమ్లా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టులను నిషేధిత ఝార్ఖండ్ జన్ ముక్తి పరిషద్ (జేజేఎంపీ) సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. మృతులను సబ్-జోనల్ కమాండర్లు పేర్కొన్నారు.
జార్ఖండ్: గుమ్లాలో భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అనంతరం వారి దగ్గర నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గుమ్లాలో మావోయిస్టుల ఉన్నారన్న సమాచారంతో.. దాడి చేసిన భద్రతా దళాలు మావోయిస్టులను మట్టుపెట్టాయి. ఇరువర్గాల మధ్య భీకర ఎదరుకాల్పులు జరిగినట్లు సమాచారం. అయితే ఇప్పటికి కాల్పులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మృతిచెందిన మావోయిస్టులను నిషేధిత ఝార్ఖండ్ జన్ ముక్తి పరిషద్ (జేజేఎంపీ) సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. మృతులను సబ్-జోనల్ కమాండర్లు పేర్కొన్నారు. మృతి చెందిన వారిలో రూ.5 లక్షల రివార్డున్న ఇద్దరు కమాండర్లు ఉన్నట్లు చెప్పారు. పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపగా, పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.
ఘటనా స్థలం నుంచి కీలక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 2025లో ఇప్పటివరకు మొత్తం 32 మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్లు ఝార్ఖండ్ పోలీస్ శాఖ వెల్లడించింది. 2026 నాటికి రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా మార్చడమే లక్ష్యంగా.. కేంద్ర పారామిలటరీ బలగాల సహకారంతో ప్రత్యేక ఆపరేషన్లను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.
అయితే నిన్న(మంగళవారం) కూడా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు హతమైనట్టు అధికారులు పేర్కొన్నారు. వీరిని మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులైన రాజు దాదా అలియాస్ కట్టా రామచంద్రారెడ్డి, కోస దాదా అలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ తెలంగాణలోని కరీంనగర్‌కు చెందినవారని నారాయణ్ పూర్ ఎస్పీ రాబిన్‌సన్ గురియా తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
కమిషనర్ వార్నింగ్.. పనితీరు మారకుంటే చర్యలు తప్పవు