Share News

Indian Airports Alert: విమానాశ్రయాలకు ఉగ్రముప్పు.. హై అలర్ట్

ABN , Publish Date - Aug 06 , 2025 | 10:03 AM

టెర్మినల్స్‌, పార్కింగ్ ఏరియాలు, పెరీమీటర్ జోన్లు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచుతూ 24 గంటలూ అప్రమత్తతను పాటించాలని, స్థానిక పోలీసుల సమన్వయంతో సిటీసైడ్ సెక్యూరిటీ చర్యలను ఎయిర్‌పోర్ట్‌లు చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన భదత్రా బ్యూరో సూచించింది. అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో పంపే మెయిల్ పార్సిళ్లను క్షుణ్ణంగా సోదా చేయాలని, సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్లను కూడా తనిఖీలు చేయాలని అప్రమత్తం చేసింది.

Indian Airports Alert: విమానాశ్రయాలకు ఉగ్రముప్పు.. హై అలర్ట్
Airports high alert

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రతకు ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ మధ్య ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ప్రమాదం ఉండవచ్చని ఇంటెలిజన్స్ వర్గాలు హెచ్చరికలు చేయడంతో కేంద్ర పౌర విమానయాన భదత్రా బ్యూరో అన్ని విమానాశ్రయాలకు ఆగస్టు 4న అడ్వయిజరీలు జారీ చేసింది. తక్షణం ఎయిర్ పోర్టుల భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. ఎయిర్‌స్ట్రిప్ట్, హెలిప్యాడ్స్, ఫ్లైయింగ్ స్కూళ్లు, శిక్షణ సంస్థల్లో భద్రతను పటిష్టం చేయాలని సూచించింది.


టెర్మినల్స్‌, పార్కింగ్ ఏరియాలు, పెరీమీటర్ జోన్లు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచుతూ 24 గంటలూ అప్రమత్తతను పాటించాలని హెచ్చరించింది కేంద్ర పౌర విమానయాన భదత్రా బ్యూరో. అలాగే స్థానిక పోలీసుల సమన్వయంతో సిటీసైడ్ సెక్యూరిటీ చర్యలనూ ఎయిర్‌పోర్ట్‌లు చేపట్టాలని సూచించింది.


అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో పంపే మెయిల్ పార్సిళ్లను క్షుణ్ణంగా సోదా చేయాలని, సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్లను కూడా తనిఖీలు చేయాలని అప్రమత్తం చేసింది. అనుమానాస్పదంగా వ్యక్తులు, లగేజీ కనిపిస్తే తక్షణమే సిబ్బంది దృష్టికి ప్రయాణికులు తీసుకువెళ్లాలని, సీసీటీవీ సిస్టమ్‌లతో నిరంతర నిఘా కొనసాగించాలని సూచించింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు, ప్రోటోకాల్స్‌ను సమీక్షించి, యాక్టివేట్ చేయాలని అడ్వయిజరీలో పేర్కొంది. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్లు తప్పనిసరిగా స్పెషల్ ఎయిర్‌లైన్ పాసింజర్ సర్వీస్ కమిటీ సమావేశాలు జరపాలని సూచించింది.


ఇవి కూడా చదవండి..

నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో మార్చి తర్వాత భారీగా పరిశ్రమలు

ఈడీ విచారణకు అనిల్‌ అంబానీ హాజరు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 06 , 2025 | 11:47 AM