Karur Stampede: ట్రాజిడీ జరిగితే టీవీకే నేతలు వెళ్లిపోతారా.. విజయ్‌ను మందలించిన కోర్టు
ABN , Publish Date - Oct 03 , 2025 | 07:31 PM
పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజల కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత లేదా? టీవీకే పార్టీ నిర్వాహకులను హైకోర్టు ప్రశ్నించింది. 'ఈవెంట్ నిర్వాహకులుగా ప్రజల పట్ల మీకు బాధ్యత లేదా' అని కోర్టు ప్రశ్నించింది.
చెన్నై: తమిళనాడు (Tamilnadu)లోని కరూర్ (Karur)లో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన ఘటనకు సంబంధించి టీవీకే (TVK) నేతలను హైకోర్టు (High Court) తీవ్రస్థాయిలో మందలించింది. ఘటన జరిగిన తర్వాత టీవీకే నేతలంతా అక్కడి నుంచి వెళ్లిపోవడాన్ని నిలదీసింది. ప్రమదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోవడం వారి ఆలోచనా ధోరణిని తెలియజేస్తోందని తప్పుపట్టింది. నమక్కల్ జిల్లా కార్యదర్శి ఎన్.సతీష్ కుమార్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజల కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత లేదా? అని నిర్వాహకులను హైకోర్టు ప్రశ్నించింది. 'ఈవెంట్ నిర్వాహకులుగా ప్రజల పట్ల మీకు బాధ్యత లేదా' అని కోర్టు ప్రశ్నించింది.
చెట్టు కూలిపోవడం వల్లే తొక్కిసలాట
చెట్టు కూలిపోవడంతో తొక్కసలాట జరిగిందని విచారణ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. టీవీకే చీఫ్ విజయ్ రోడ్‌షో పలు షరతులను ఉల్లంఘించిందని ఆరోపించింది. ప్రభుత్వం కనుక రోడ్‌షోను రద్దు చేసి ఉంటే శాంతిభద్రతల పరిస్థితి విషమించే ఉండేదని పేర్కొంది. ర్యాలీకి వచ్చిన వారిలో పిల్లలు కూడా ఉన్నారని, కానీ వారి కోసం ఎలాంటి ఏర్పాటు చేయలేదని తెలిపింది. కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా లేదని, పోలీసులకు సైతం తాగేందుకు మంచినీటి ఏర్పాటు చేయలేదని విమర్శించింది. సొంత క్యాడర్ తప్పదాల వల్లే తొక్కిసలాట జరిగిందని, నేతలు బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని కోర్టుకు విన్నవించింది.
ఇవి కూడా చదవండి..
జాగ్రత్త.. ఉగ్రవాదాన్ని ఆపకపోతే ప్రపంచ పటం నుంచి తుడిచేస్తాం..
పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం.. ఐఏఎఫ్ చీఫ్ గూస్‌బమ్స్ కామెంట్లు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి