Army Chief Warning Pakistan: జాగ్రత్త.. ఉగ్రవాదాన్ని ఆపకపోతే ప్రపంచ పటం నుంచి తుడిచేస్తాం..
ABN , Publish Date - Oct 03 , 2025 | 04:23 PM
బికనీర్ మిలటరీ స్టేషన్‌తో సహా పలు ఫార్వార్డ్ ఏరియాల్లో శుక్రవారం నాడు ఉపేంద్ర ద్వివేది పర్యటించారు. బలగాల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.
అనూప్‌గఢ్: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan)కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) శుక్రవారం నాడు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చారు. భారత్‌లో ఉగ్రవాదాన్ని స్పానర్స్ చేసే చర్యలను పాక్ మానుకోకుంటే ఆ దేశం ప్రపంచ పటం నుంచి కనుమరుగవుతుందని హెచ్చరించారు. భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో చూపించిన సంయమనాన్ని ప్రతిసారీ చూపించలేవని అన్నారు. ఈసారి నిర్ణయాత్మక, అత్యంత శక్తివంతమైన సమాధానం ఇస్తుందని చెప్పారు.
'ఆపరేషన్ సిందూర్ 1.0లో చూపిన సంయమనాన్ని ఈసారి చూపించం. ప్రపంచ పటంలో ఉండాలనుకుంటోందో, లేదో తేల్చుకునేలా ఈసారి పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఉంటుంది. ప్రపంచ పటంలో పాక్ ఉండదలిస్తే మాత్రం ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడం ఆపితీరాలి' అని జనరల్ ద్వివేది అన్నారు.
బికనీర్ మిలట్రీ స్టేషన్‌తో సహా పలు ఫార్వార్డ్ ఏరియాల్లో శుక్రవారం నాడు ఉపేంద్ర ద్వివేది పర్యటించారు. బలగాల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. మిలట్రీ సీనియర్ అధికారులు, వెటరన్స్, సివిల్ డిగ్నటరీలతో ఆయన సమావేశం అయ్యారు. ఆధునికీకరణ, యుద్ధ సన్నాహకాలు, అడ్వాన్సింగ్ టెక్నలాజికల్ సామర్థ్యాలు, ఆపరేషనల్ ఎక్స్‌లెన్స్‌కు ఆర్మీ కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం.. ఐఏఎఫ్ చీఫ్ గూస్‌బమ్స్ కామెంట్లు
నా భర్తను విడిచిపెట్టండి.. సుప్రీంకోర్టుకు సోనం వాంగ్‌చుక్ భార్య
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి