IAF Chief statement: పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం.. ఐఏఎఫ్ చీఫ్ గూస్‌బమ్స్ కామెంట్లు
ABN , Publish Date - Oct 03 , 2025 | 01:45 PM
ఆపరేషన్ సిందూర్‌పై ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గూస్‌బమ్స్ కామెంట్లు చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టామని అన్నారు. ఐఏఎఫ్ సత్తా ఎలాంటిదో ప్రపంచం చూసిందని, శత్రువుల స్థావరాలపై కచ్చితత్వంతో దాడి చేశామని ఆయన చెప్పారు.
ఆపరేషన్ సిందూర్‌పై ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గూస్‌బమ్స్ కామెంట్లు చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టామని అన్నారు. శుక్రవారం ఏపీ సింగ్ మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్‌కు చెందిన ఐదు ఫైటర్ జెట్లను కూల్చేశాం. వాటిలో అమెరికాలో తయారైన ఎఫ్ 16, చైనాలో తయారు అయిన జే 17లను యుద్ధం సందర్భంగా కూల్చేశాము.
ఐదు ఎయిర్ క్రాఫ్ట్‌లతో పాటు ఒక బిగ్ బర్డ్ (ఎయిర్‌బర్నీ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్)ను పేల్చేశాం. పాక్ ఎయిర్ బేస్‌లపై కూడా దాడి చేశాం. వాటిని కూడా పేల్చేశాం. జాకోబాబాద్, భోలారీ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశాం. ఐఏఎఫ్ సత్తా ఎలాంటిదో ప్రపంచం చూసింది. శత్రువుల స్థావరాలపై కచ్చితత్వంతో దాడి చేశాం. ఆపరేషన్ సిందూర్‌లో కేంద్రం మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఎయిర్‌ఫోర్స్ దెబ్బకు పాక్ కాళ్ల బేరానికి వచ్చింది.
కాల్పుల విరమణకు రావాలని కోరింది. భారత్ ఇందుకు సానుకూలంగా స్పందించింది. అందుకే మే 10న యుద్ధం ఆగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయంతో ఈ యుద్ధాన్ని భారత్ ఆపలేదు. పహల్గామ్‌లో అమాయకులను చంపినందుకు ఉగ్రవాదులు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు’ అని చెప్పుకొచ్చారు. కాగా, తన వల్లే భారత్, పాక్ యుద్ధం ఆగిందని ట్రంప్ తరచుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా భారత్, పాక్ యుద్ధం ప్రస్తావన తెస్తున్నారు.
ఇవి కూడా చదవండి
హ్యాండ్ షేక్ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త..
చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు.. పాపం రెండేళ్ల బాలుడు..