మరోసారి వైభవ్ సెంచరీ మిస్.. రాజస్థాన్ స్కోర్ 214/6
ABN , Publish Date - May 29 , 2026 | 09:31 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ కీలక పోరు జరుగుతోంది. క్వాలిఫయర్- 2లో భాగంగా చండీగఢ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ కీలక పోరు జరుగుతోంది. క్వాలిఫయర్- 2లో భాగంగా చండీగఢ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కూడా విధ్వంసం సృష్టించిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ.. రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
రాజస్థాన్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ(96), జడేజా(45), ఫెరీరా(38) రాణించారు. కెప్టెన్ రియాన్ పరాగ్ కేవలం 11 పరుగులు చేశాడు. ఓపెనర్ యశ్వస్వి జైస్వాల్(1) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రబాడా, జేసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు సాధించారు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ పడగొట్టారు. మొత్తంగా గుజరాత్ టైటాన్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ 215 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.
ఇవి కూడా చదవండి:
ప్రశాంతత కావాలని అనిపించినప్పుడల్లా కార్టూన్లు చూస్తాను: వైభవ్
వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్