Share News

ఎల్ఎస్‌జీ కెప్టెన్సీకి పంత్ రాజీనామా

ABN , Publish Date - May 29 , 2026 | 05:51 PM

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ సీజన్‌లో లఖ్‌నవూకు సారథ్యం వహించిన రిషభ్‌ పంత్‌ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఫ్రాంఛైజీ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటన చేసింది.

ఎల్ఎస్‌జీ కెప్టెన్సీకి పంత్ రాజీనామా
Rishabh Pant

స్పోర్ట్స్ డెస్క్: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ సీజన్‌లో లఖ్‌నవూ (LSG)కు సారథ్యం వహించిన రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఫ్రాంఛైజీ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటన చేసింది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. మొత్తం 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.


కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఉపశమనం కల్పించాలన్న పంత్ అభ్యర్థనను తాము అంగీకరించినట్లు ఎల్ఎస్‌జీ తెలిపింది. ‘కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని రిషభ్‌ పంత్‌ చేసిన అభ్యర్థనను ఫ్రాంఛైజీ మర్యాదపూర్వకంగా అంగీకరించింది. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత ఈజీ కాదు. కెప్టెన్‌గా పంత్‌ ఇప్పటివరకు ఫ్రాంఛైజీకి బాగా సేవలందించాడు’ అని రాసుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టును అత్యుత్తమ ప్రమాణాలతో పునర్న్మించడంపై తాము దృష్టి పెట్టినట్లు తెలిపింది.


2025 ఐపీఎల్‌ (IPL) మెగా వేలంలో పంత్‌ను లఖ్‌నవూ ఫ్రాంఛైజీ ఏకంగా రూ.27 కోట్లతో దక్కించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బ్యాటింగ్‌ పరంగానూ పంత్ ఆకట్టుకోలేకపోయాడు. గత సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌ల్లో కేవలం 269 పరుగులు చేసిన అతడు.. ఈ ఏడాది మొత్తంగా 312 పరుగులు సాధించాడు.


ఇవి కూడా చదవండి:

ప్రశాంతత కావాలని అనిపించినప్పుడల్లా కార్టూన్లు చూస్తాను: వైభవ్

వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

Updated Date - May 29 , 2026 | 06:24 PM