ఆర్టీసీపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
ABN , Publish Date - May 29 , 2026 | 08:39 PM
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) బలోపేతంపై సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సంస్థ సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
అమరావతి, మే 29: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) బలోపేతంపై సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సంస్థ సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆస్తుల సద్వినియోగం, ఉద్యోగుల సంక్షేమం, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, బస్సుల నిర్వహణ, సదుపాయాలతోపాటు సంస్థ బలోపేతంపై ఈ సమీక్షలో చర్చించారు.
అలాగే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతోపాటు ఆ శాఖలోని పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై ఇప్పటికే యూనియన్ నేతలతో అధికారులు ఒక దఫా చర్చలు నిర్వహించారు.
సైబర్ నేరాల అడ్డుకట్టకు ‘ఏపీ సైబర్ గార్డ్’: సీఎం చంద్రబాబు
సైబర్ నేరాలపై ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలని.. అందుకోసం సైబర్ పెట్రోలింగ్ జరగాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యచరణపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు ‘ఏపీ సైబర్ గార్డ్’ అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు.
6 పిల్లర్స్ రెస్పాన్స్ టీమ్స్‌తో ఈ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చునని చెప్పారు. సైబర్ మోసాలపై ఫిర్యాదు అందిన మరుక్షణమే వార్ రూంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏపీలో సైబర్ నేరానికి పాల్పడితే... తప్పించుకోలేమనే భయం క్రిమినల్స్‌లో రావాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ప్రజలు నష్టపోకుండా సహకరించాలని బ్యాంకు అధికారులకు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
For More AP News And Telugu News