Share News

బ్యాటింగ్‌లో ఇంకాస్త మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సింది: రియాన్ పరాగ్

ABN , Publish Date - May 28 , 2026 | 10:10 AM

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్.. క్వాలిఫయర్ 2కి అర్హత సాధించింది. అయితే జట్టు ప్రదర్శనపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడాడు. బ్యాటింగ్‌లో ఇంకాస్త మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సిందంటూ వ్యాఖ్యానించాడు.

బ్యాటింగ్‌లో ఇంకాస్త మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సింది: రియాన్ పరాగ్
Riyan Parag

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్.. క్వాలిఫయర్ 2కి అర్హత సాధించింది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్.. 8 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. ఛేదనలో హైదరాబాద్ 196 పరగులకే ఆలౌటైంది. అయితే జట్టు ప్రదర్శనపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడాడు. బ్యాటింగ్‌లో ఇంకాస్త మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సిందంటూ వ్యాఖ్యానించాడు.


‘నేను ప్రతి విషయంలో ఫర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటా. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మాకు శుభారంభం దక్కింది. అదే దూకుడును ఆఖరి వరకు కొనసాగించలేకపోయాం. మేం 260 పరుగులు చేసి ఉంటే బాగుండేది. వైభవ్ నుంచి అద్భుతమైన స్టార్ట్ వచ్చాక ఆ మాత్రం స్కోర్ అయినా చేయాల్సింది. తప్పకుండా దానిపై వర్కౌట్ చేయాలి. అయితే బౌలింగ్‌లో మాత్రం అద్భుతంగా రాణించాం. ఛేదనలో ఎస్ఆర్‌హెచ్ దూకుడుగా ఆడింది. మూడు ఓవర్లలోనే హాఫ్ సెంచరీని దాటేసింది. ఇషాన్ కిషన్, హెడ్‌ను ఔట్ చేసి మళ్లీ రేసులోకి వచ్చాం. వైభవ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లేదా మ్యాచ్‌కు ముందు మేం పెద్దగా సంభాషించుకోలేదు. అతడి బ్యాటింగ్‌పై చర్చ జరగదు. వైభవ్‌ను ఒంటరిగా వదిలేస్తాం. ఎలా ఆడతానని చెబుతాడో.. అదే విధ్వంసాన్ని మైదానంలో చేసి చేసి చూపిస్తాడు. నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తాడు. ఈ సీజన్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ విజయం కోసం శ్రమించాం. క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌కు ముందు కాస్త విశ్రాంతి తీసుకుంటాం. ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలని అనుకోవడం లేదు’ అని రియాన్ పరాగ్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

యూనివర్సల్ బేబీ బాస్ తాండవం.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు

గేల్ సెంచరీ రికార్డు ఎందుకు మిస్ అయ్యానంటే..: వైభవ్ సూర్యవంశీ

Updated Date - May 28 , 2026 | 10:10 AM