Share News

టీ20 ప్రపంచ కప్ 2026: భారత్ ఘన విజయం

ABN , Publish Date - Feb 12 , 2026 | 10:44 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

టీ20 ప్రపంచ కప్ 2026: భారత్ ఘన విజయం
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా బ్యాటర్లు.. 18.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటయ్యారు. టీమిండియా బౌలర్ల ధాటికి క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు.


స్లీక్యాంప్(29) టాప్ స్కోరర్. ఫ్రైలింక్(22), లాఫ్టీ(13), ఎరాస్మస్(18), గ్రీన్(11) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. నమీబియా ఆదిలో కాస్త పోరాడినా.. ఆఖరి వరకు దూకుడును కొనసాగించలేకపోయింది. వెనువెంటనే వికెట్లను కోల్పోయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో ఇషాన్ కిషన్(61), హార్దిక్ పాండ్య(52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. తిలక్ వర్మ(25), సంజు శాంసన్(22), దూబె(23) పర్వాలేదనిపించారు. నమీబియా బౌలర్లలో ఎరాస్మస్ 4, షికోంగో, స్మట్, షోల్ట్జ్ తలొక వికెట్ పడగొట్టారు. కాగా గ్రూప్ స్టేజిలో టీమిండియాకు ఇది రెండో విజయం.


ఇవి కూడా చదవండి:

అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

Updated Date - Feb 12 , 2026 | 10:46 PM