Share News

టీ20 వరల్డ్ కప్2026: ఇషాన్ కిషన్ విధ్వంసం.. భారత్ భారీ స్కోర్

ABN , Publish Date - Feb 12 , 2026 | 08:48 PM

టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ఇవాళ(గురువారం) నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 209 పరుగులు భారీ స్కోర్ చేసింది.

టీ20 వరల్డ్ కప్2026: ఇషాన్ కిషన్ విధ్వంసం.. భారత్ భారీ స్కోర్
India vs Namibia

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ఇవాళ(గురువారం)నమీబియాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(24 బంతుల్లో 61) చెలరేగి ఆడటంతో టీమిండియా 209 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య(28 బంతుల్లో 52) కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లకు భారత్ 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.


టాస్‌ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్య (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఇషాన్‌, హార్దిక్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్‌ ఇంకా భారీ స్కోర్‌ సాధిస్తుందని అంతా భావించారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. మిగిలిన బ్యాటర్లలో సంజూ శాంసన్‌ (8 బంతుల్లో 22; ఫోర్‌, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.


అలానే తిలక్‌ వర్మ (21 బంతుల్లో 25), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (13 బంతుల్లో 12) ఆచితూచి ఆడారు. శివం దూబే (16 బంతుల్లో 23) పర్వాలేదనిపించాడు. చివర్లో రింకూ సింగ్‌ (6 బంతుల్లో ఒక పరుగు) బంతులు వృధా చేశాడు. ఇక నమీబియా బౌలర్లలో కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ 4 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. షికోంగో, స్మిట్, బెర్నాల్డ్‌ స్కోల్జ్‌ తలో వికెట్ సాధించారు.


ఇవి కూడా చదవండి:

అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

Updated Date - Feb 12 , 2026 | 09:49 PM