Share News

టీ20 ప్రపంచ కప్2026: టాస్ ఓడిన భారత్...

ABN , Publish Date - Feb 12 , 2026 | 06:35 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) భారత్, నమీబియా తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

టీ20 ప్రపంచ కప్2026: టాస్ ఓడిన భారత్...
India

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) భారత్, నమీబియా తలపడనున్నాయి. ఢిల్లీ వేదికగా మరికాసేపట్లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. అనారోగ్యం కారణంగా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. అభిషేక్ శర్మ స్థానంలో ఓపెనర్ గా సంజూ శాంసన్ బరిలోకి దిగనున్నాడు. అలానే మహ్మద్ సిరాజ్ స్థానంలో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎంట్రీ ఇచ్చాడు.


పిచ్ ఎలా ఉందంటే..

ఇక భారత్ , నమీబియా మ్యాచ్‌కు వేదికైన అరుణ్ జెట్లీ స్డేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. బౌండరీలు చిన్నవి కావడం బ్యాటర్లకు కలిసొచ్చే అంశం. ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది. అలానే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పులేదని వాతావరణశాఖ తెలిపింది.


తుది జట్లు

భారత జట్టు:

సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా,

నమీబియా జట్టు:

గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్ (వికెట్ కీపర్), లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్, జె.జె. స్మిత్, రూబెన్ ట్రంపెల్మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మాక్స్ హీంగో, మలన్ క్రుగర్, బెన్ షికోంగో


ఇవి కూడా చదవండి:

అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

Updated Date - Feb 12 , 2026 | 06:57 PM