Share News

టీ20 ప్రపంచ కప్ 2026: ఇటలీ చేతిలో నేపాల్ చిత్తు

ABN , Publish Date - Feb 12 , 2026 | 05:52 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా వాంఖడే వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇటలీ ఓపెనర్లు జస్టిన్ మోస్కా(60), ఆంథోనీ మోస్కా(62) హాఫ్ సెంచరీలతో అజేయంగా నిలిచారు.

టీ20 ప్రపంచ కప్ 2026: ఇటలీ చేతిలో నేపాల్ చిత్తు
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా వాంఖడే వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇటలీ ఓపెనర్లు జస్టిన్ మోస్కా(60), ఆంథోనీ మోస్కా(62) హాఫ్ సెంచరీలతో అజేయంగా నిలిచారు. నేపాల్ నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 12.4 ఓవర్లలోనే ఛేదించారు. ఎట్టకేలకు ఇటలీ జట్టు గ్రూప్ స్టేజిలో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.


ఇటలీ ఓపెనర్ల బ్యాటింగ్‌కు నేపాల్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. నేపాల్ బౌలర్లు వారిని ఔట్ చేయడానికి విఫలయత్నం చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. 19.3 ఓవర్లలో 123 పరుగులు చేసింది. ఆరిఫ్ షేక్(27) టాప్ స్కోరర్. ఆసిఫ్ షేక్(20), రోహిత్ పాడెల్(23) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. ఇటలీ బౌలర్లలో క్రిషన్ 3, బెన్ మానేంటి 2, అలీ హసన్, స్మట్స్, జస్‌ప్రీత్ సింగ్ తలొక వికెట్ పడగొట్టారు. కాగా ఇంగ్లండ్‌పై అద్భుత ప్రదర్శన చేసి అందరి ప్రశంసలు అందుకున్న నేపాల్ జట్టు.. ఇటలీపై మాత్రం రాణించలేకపోయింది. ఇంగ్లండ్ చేతిలో పోరాడి 4 పరుగుల తేడాతో నేపాల్ ఓడిన విషయం తెలిసిందే. గ్రూప్ స్టేజిలో 2 మ్యాచ్‌లు ఆడేసిన నేపాల్.. ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. దీంతో సెమీస్ ఆశలు దాదాపు గల్లంతు అయినట్లే.


ఇవి కూడా చదవండి:

అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

Updated Date - Feb 12 , 2026 | 05:55 PM