Share News

టీ20 ప్రపంచకప్2026: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:36 PM

టీ20 వరల్డ్‌ కప్‌ 2026 భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఒమన్‌ తడబడింది. 18 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది.

టీ20 ప్రపంచకప్2026: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం
Ireland vs Oman T20 World Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: టీ20 వరల్డ్‌ కప్‌(World Cup-2026) భాగంగా ఒమన్ తో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఇవాళ(శనివారం) కొలంబో వేదికగా ఒమన్‌, ఐర్లాండ్(Ireland vs Oman) జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఒమన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్(51 బంతుల్లో 94*) చెలరేగి ఆడాడు. అనంతరం ఛేదనలో ఒమన్‌ తడబడింది. 18 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది.


ఒమన్‌ బ్యాటర్లలో అమీర్‌ కలీమ్‌ (29 బంతుల్లో 50 పరుగులు), హమ్మద్‌ మీర్జా (37 బంతుల్లో 46 పరుగులు) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఐర్లాండ్‌ బౌలర్లలో జాషువా లిటిల్‌ 3 వికెట్లు తీసుకున్నాడు. మాథ్యూ హంఫ్రీస్‌, బారీ మెక్‌కార్తీ చెరో రెండు, జార్జి డాక్రెల్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. అంతకంటే ముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 235 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్‌ లోర్కాన్‌ టక్కర్‌ (94*) తృటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. గారెత్‌ డెలానీ (30 బంతుల్లో 56 పరుగులు) అర్ధ సెంచరీతో రాణించాడు.


టక్కర్‌, గారెత్‌ డెలానీ ఐదో వికెట్‌కు 56 బంతుల్లో 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో జార్జ్ డాక్రెల్ (9 బంతుల్లో 35 పరుగులు) ఒమన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆఖరి ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు బాదాడు. లోరాన్‌ టక్కర్‌, జార్జ్ జోడీ 19 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇక ఒమన్ బౌలర్లలో షకీల్‌ అహ్మద్‌ మూడు, నదీమ్‌ ఖాన్‌, షా ఫైసల్‌ తలో వికెట్‌ సాధించారు. ఐర్లాండ్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్(Lorcan Tucker) 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

2003 ప్రపంచ కప్ టోర్నీ.. సచిన్ ఆడిన ఆ నాక్ పాక్‌కు గుర్తుండిపోద్ది!

పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ

Updated Date - Feb 14 , 2026 | 05:21 PM