Share News

ఆస్ట్రేలియాతో తొలి టీ20.. భారత మహిళల ఘన విజయం

ABN , Publish Date - Feb 15 , 2026 | 05:43 PM

భారత మహిళా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఆస్ట్రేలియాతో తొలి టీ20.. భారత మహిళల ఘన విజయం
India Women vs Australia Women

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. ఛేదనకు దిగిన భారత్ 5.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే వరుణుడు ఆటకు ఆటంకం కలిగించాడు. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో ఫలితాన్ని డీఎల్ఎస్ పద్ధతిలో అంపైర్లు ప్రకటించారు. వర్షం వచ్చే సమయానికి భారత్ అదనంగా 21 పరుగులు చేసి ఉండటంతో విజేతగా నిలిచింది.


ఆస్ట్రేలియా బ్యాటర్లలో జార్జియా(30) టాప్ స్కోరర్. లిచ్‌ఫీల్డ్(26), ఎలీస్ పెర్రీ(20) పర్వాలేదనిపించారు. ఇతర బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అరుంధతీ రెడ్డి 4 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించింది. శ్రీచరణి, రేణుకా సింగ్ తలో 2, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరొక వికెట్ తీసుకున్నారు. ఛేదనలో వర్షం పడే సమయానికి షఫాలీ వర్మ(21) ఔట్ అవ్వగా.. స్మృతి మంధాన (16*), జెమీమా రోడ్రిగ్స్(9*) క్రీజులో ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్

Updated Date - Feb 15 , 2026 | 05:51 PM