టీ20 ప్రపంచ కప్ 2026: మోనాంక్, సంజయ్ హాఫ్ సెంచరీలు.. నమీబియా టార్గెట్ 200
ABN , Publish Date - Feb 15 , 2026 | 04:43 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం వేదికగా నమీబియా-యూఎస్ఏ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అమెరికా జట్టు చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం వేదికగా నమీబియా-యూఎస్ఏ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అమెరికా జట్టు చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ మోనాంక్ పటేల్(52; 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజయ్ కృష్ణమూర్తి(68*; 33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. నమీబియాకు 200 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించారు.
షయాన్ జహంగీర్(22), సాయితేజ ముక్కామల(17), మిలింద్ కుమార్(28) పర్వాలేదనిపించారు. నమీబియా బౌలర్లలో విల్లెం మైబర్గ్, ఎరాస్మస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. నమీబియా విజయానికి 200 పరుగులు అవసరం.
ఇవి కూడా చదవండి:
భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..
భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్