Share News

భారత్-పాక్ మ్యాచ్.. ఫలితాన్ని శాసించనున్న పిచ్!

ABN , Publish Date - Feb 15 , 2026 | 03:21 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని పిచ్ శాసించనుంది. మైదానంలో పరిస్థితులే కీలకం కానున్నాయి.

భారత్-పాక్ మ్యాచ్.. ఫలితాన్ని శాసించనున్న పిచ్!
India vs Pakistan

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య పోరు సాగనుంది. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని పిచ్ శాసించనుంది. మైదానంలో పరిస్థితులే కీలకం కానున్నాయి. ఇరు జట్ల కోచ్‌లు పిచ్‌ను జాగ్రత్తగా అర్థం చేసుకుని వ్యూహ రచన చేస్తున్నారు.


సాధారణంగా ప్రేమదాస స్టేడియంలోని పిచ్ స్పిన్నర్లకే అనుకూలం. ఈ ప్రపంచ కప్‌లో ఇక్కడ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడారు. వీటిల్లో మొత్తం 20 వికెట్లు స్పిన్నర్లకు లభించగా.. 21 వికెట్లు సీమర్లకు దక్కాయి. కాకపోతే మూడు మ్యాచ్‌ల్లోనూ రన్‌రేట్‌కు కళ్లెం వేసింది మాత్రం స్పిన్నర్లే. ఇక్కడ పేసర్లు వైవిధ్యమైన బంతులు సంధిస్తే ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది. గత మూడేళ్లలో ప్రేమదాస మైదానం స్పిన్నర్లకే ఎక్కువగా స్పిన్నర్లకే సహకరించింది.


డ్యూ వస్తే..!

ఆసీస్‌పై జింబాబ్వే విజయం సాధించిన పిచ్‌పై భారత్-పాక్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే పిచ్ బాగా నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి. ఇక కొలంబోలో ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో డ్యూ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆదివారం స్టేడియం పరిసరాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున డ్యూ వచ్చే ప్రసక్తే లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టుపైనే అందరి ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి:

భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్

Updated Date - Feb 15 , 2026 | 03:59 PM