భారత్, పాక్ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసేది ఈ నలుగురు ప్లేయర్లే..!
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:44 AM
క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ దాయాది జట్ల మ్యాచులకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే అనేక సార్లు తలపడ్డ భారత్, పాక్ జట్లు ..టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా మరోసారి తలపడనున్నాయి.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్(IND VS PAK) మ్యాచులకు ప్రత్యేక క్రేజ్ ఉంది. అలానే ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే అనేక సార్లు తలపడ్డ భారత్, పాక్ జట్లు ..టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా మరోసారి తలపడనున్నాయి. మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. ఇదే సమయంలో ఇండియా , పాక్ మ్యాచ్ ఫలితాన్ని నలుగురు ప్లేయర్లు డిసైడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ ఆటగాళ్లు ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్2026లో నమీబియాపై ఇషాన్ కేవలం 24 బంతుల్లో 61 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అదేవిధంగా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కిషన్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తే, టీమిండియా కచ్చితంగా గెలుస్తుంది. ఇక టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అనే మూడు ఫార్మాట్లలో తన ప్రతిభను నిరూపించుకుంటూ వస్తున్నాడు. జట్టు చివరి క్షణంలో ఇబ్బంది పడుతున్నప్పుడల్లా, పరుగులు సాధించడంతో పాటు విజయం సాధించడంలోనూ పాండ్య కీలకంగా మారాడు. ఇవాళ పాక్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా హార్దిక్(Hardik Pandya ) తన ఫామ్‌ను కొనసాగిస్తే, భారత జట్టుకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది.
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) పాకిస్థాన్‌తో ఆడినప్పుడల్లా బాగా రాణించాడు. వన్డే ప్రపంచ కప్ 2023, టీ20 ప్రపంచ కప్2024లో బుమ్రా పాక్ జట్టుకు ఒక పీడ కలలా మిగిలాడు. అందువల్ల టీ20 ప్రపంచ కప్2026లో బుమ్రా సందడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు. ఇక చివరగా ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా కీలకం కానున్నాడు. అతడి స్పిన్ బౌలింగ్ స్టార్ బ్యాటర్లను కూడా ఆశ్చర్య పరిచింది. అందువల్ల, వరుణ్ చక్రవర్తి పాకిస్థాన్ పై తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే.. భారత్ లాభపడుతుంది. మొత్తంగా ఈ నలుగురు ప్లేయర్లు భారత్, పాక్ మ్యాచ్ లో నిర్ణయాత్మకంగా మారుతారని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభ కానుంది.
ఇవి కూడా చదవండి:
భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..
భారత్-పాక్ మ్యాచ్: టీమిండియాకు ఒకే ఒక్క ఓటమి.. అదెప్పుడంటే?