టీ20 ప్రపంచ కప్ 2026: సూపర్ 8కు భారత్.. ప్రత్యర్థులు ఎవరంటే?
ABN , Publish Date - Feb 17 , 2026 | 07:54 PM
టీ20 ప్రపంచ కప్ 2026.. ఇప్పటికే గ్రూప్ స్టేజి దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. భారత్, జింబాబ్వే, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి. ఈ నేపథ్యంలో సూపర్ 8లో టీమిండియాతో తలపడే జట్లు ఖారారయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026.. ఇప్పటికే గ్రూప్ స్టేజి దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఏడు జట్లు సూపర్ 8కి అర్హత సాధించాయి. ఎనిమిదో జట్టుగా పాకిస్థాన్ లేదా యూఎస్ఏ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. గ్రూప్ స్టేజిలోనే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. కాగా భారత్, జింబాబ్వే, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి. ఈ నేపథ్యంలో సూపర్ 8లో టీమిండియాతో తలపడే జట్లు ఖారారయ్యాయి.
సూపర్ 8లో భాగంగా భారత్‌తో పాటు జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు గ్రూప్ 1 లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరగనున్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకతో పాటు మరో జట్టు గ్రూప్ 2లో ఉంటాయి. ఈ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరగనున్నాయి.
టీమిండియా తమ తొలి సూపర్ 8 మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న సౌతాఫ్రికాతో ఆడనుంది. దీనికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
రెండో సూపర్ 8 మ్యాచ్ ఫిబ్రవరి 26న జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జింబాబ్వేతో తలపడనుంది.
భారత్ తమ మూడో సూపర్ 8 మ్యాచ్‌లో మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌ను ఢీకొట్టనుంది. కాగా ఈ మ్యాచ్‌లన్నీ సాయంత్రం ఏడింటికే మొదలవుతాయి.
గ్రూప్ 1, గ్రూప్ 2లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ మ్యాచ్‌లు మార్చి 4,5 తేదీల్లో జరగనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు మార్చి 8న జరిగే ఫైనల్‌లో తలపడతాయి. కాగా సెమీస్, ఫైనల్ మ్యాచ్ వేదికలు ఇంకా ఖరారు కాలేదు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?
ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ