అభిషేక్ శర్మకు నేనిచ్చే సలహా అదే: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:47 PM
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడి.. రెండింట్లోనూ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఈ అంశంపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడి.. రెండింట్లోనూ డకౌట్ అయ్యాడు. నమీబియాతో మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా మైదానంలోకి దిగలేదు. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాల్సిన అభిషేక్.. శ్రీలంకలో పాక్‌తో జరిగిన కీలక పోరులోనూ నిరాశపర్చాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. భారీ షాట్లకు ప్రయత్నించి ఔట్ అవ్వగుండా.. సింగిల్స్ కూడా తీయాలని అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఈ అంశంపై స్పందించాడు.
‘అభిషేక్ శర్మకు నేనిచ్చే సలహా ఒకటే.. అతడు మొదట సింగిల్ తీయాలి అంతే. అప్పుడు కాళ్లు కూడా కదులుతాయి. తర్వాత వేగంగా పరుగులు రాబట్టడానికి ప్రయత్నించాలి. అతడు న్యూజిలాండ్‌పై మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫామ్, టచ్‌లో ఉన్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కసారి క్రీజులో కుదురుకున్న తర్వాత పెద్ద షాట్లు కొట్టేందుకు ప్రయత్నించాలి. అతడి నుంచి మనం అదే చూడాలనుకుంటున్నాం’ అని సన్నీ పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టీమిండియా సూపర్ 8కి చేరుకుంది. గ్రూప్ స్టేజిలో ఆఖరి మ్యాచ్ నెదర్లాండ్స్‌లో అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది. కాగా ఆదివారం పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?
ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ