టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్: దీప్తి శర్మను వెనక్కి నెట్టి.. అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న పాకిస్థాన్ బౌలర్
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:41 PM
పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. టీమిండియా స్టార్ క్రికెటర్ దీప్తి శర్మను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా తిరిగి తన స్థానాన్ని సంపాదించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. టీమిండియా స్టార్ క్రికెటర్ దీప్తి శర్మను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా తిరిగి తన స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన మహిళా ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో సాదియా రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో సాదియా అద్భుత ప్రదర్శనతో చెలరేగింది. మొత్తంగా ఐదు వికెట్లు తీసి సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచింది. ముఖ్యంగా బెనోనిలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో కేవలం 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకొని ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ సాధించింది. గతేడాది చివర్లో కూడా సాదియా నంబర్ వన్ స్థానాన్ని అందుకుంది.
ఫాతిమా సనా దూకుడు
ఇదిలా ఉంటే పాక్ కెప్టెన్ ఫాతిమా సనా కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. టీ20 బ్యాటర్ల జాబితాలో 31 స్థానాలు ఎగబాకి 28వ స్థానంలో నిలిచింది. అలాగే టీ20 ఆల్‌రౌండర్లలో ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి చేరింది. సౌతాఫ్రికాతో సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో 30 బంతుల్లో అజేయ 47 పరుగులు చేసి, రెండు కీలక వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది.
భారత బౌలర్లలో..
ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ అనంతరం భారత బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. రేణుకా సింగ్ ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచింది. ఆసీస్‌పై ఒకే మ్యాచ్‌లో ఏకంగా 4 వికెట్లు తీసిన అరుంధతీ రెడ్డి 19 స్థానాలు ఎగబాకి 16వ స్థానంలో నిలిచింది. శ్రీచరణి కూడా ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకుని 39వ స్థానానికి చేరింది.
ఇవి కూడా చదవండి:
నేను నఖ్వీని అలా అనలేదు: షోయబ్ అక్తర్
రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి బౌలర్‌గా రికార్డ్