గౌతమ్ గంభీర్‌కు రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే ఆఫర్
ABN , Publish Date - Feb 17 , 2026 | 01:26 PM
భారత జట్టు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ కీలక పదవులను ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెంటర్ లేదా సీఈవో, స్టాటజిక్ పార్టనర్ పదవులను అతడికి రాజస్థాన్ రాయల్స్ ఆఫర్ చేసినట్లు సమాచారం.
స్పోర్ట్స్ డెస్క్: భారత జట్టు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir)కు ఐపీఎల్ ఫ్రాంఛైజీలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ కీలక పదవులను ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా మూడు పదవులను గంభీర్‌కి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మెంటర్ లేదా సీఈవో, స్టాటజిక్ పార్టనర్ పదవులను అతడికి రాజస్థాన్ రాయల్స్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఆర్ఆర్ ఫ్రాంఛైజీ వాటాలు చేతులు మారనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే రాజస్థాన్ రాయల్స్ ప్రతిపాదనను గౌతమ్ గంభీర్ అంగీకరించే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం జాతీయ జట్టుకు హెడ్‌కోచ్‌గా ఉండటమే అందుకు ప్రధాన కారణమని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నిబంధనలు, ఒప్పందం ప్రకారం గంభీర్ 2027లో జరిగే ప్రపంచ కప్ వరకు భారత్ జట్టు ప్రధాన శిక్షకుడిగా ఉండనున్నాడు. అలాగే ప్రస్తుతం అతడు టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పొట్టి ప్రపంచ కప్‌పై గంభీర్ ఫోకస్ పెట్టాడు. అలానే 2027లో దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచ కప్ ఉన్నందున గంభీర్ జాతీయ జట్టుకు సేవలందించేందుకే మొగ్గు చూపించే ఛాన్స్ ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతడు తిరిగి ఐపీఎల్ బాధ్యతలు తలకెత్తుకునే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ రాజస్థాన్ ప్రతిపాదనను గంభీర్ అంగీకరిస్తే, అతను భారత ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది.
గతంలో గంభీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మూడు టైటిళ్లు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. రెండుసార్లు కెప్టెన్‌గా, ఒకసారి మెంటర్‌గా ఆ జట్టు విజయంలో భాగస్వామి అయ్యాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు (Lucknow Supergiants) మెంటర్‌గా వ్యవహరించాడు. అతడి పర్యవేక్షణలో ఎల్ఎస్‌జీ ఆ జట్టు వరుసగా రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌లకు అర్హత సాధించి, మూడోస్థానంలో నిలిచింది. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్2026లో ఇప్పటికే భారత్ సూపర్-8కి చేరుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
నేను నఖ్వీని అలా అనలేదు: షోయబ్ అక్తర్
రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి బౌలర్‌గా రికార్డ్
పది పరీక్షలకు దూరమైన యువ హిట్టర్ వైభవ్.. కారణం ఇదే