Share News

శ్రీలంకకు జింబాబ్వే ఝలక్‌

ABN , Publish Date - Feb 20 , 2026 | 05:13 AM

టీ20 వరల్డ్‌క్‌పలో జింబాబ్వే మరో సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాపై నెగ్గిన జింబాబ్వే.. ఆతిథ్య శ్రీలంకకు షాకిచ్చింది. గ్రూప్‌ దశను అజేయం గా ముగించిన జింబాబ్వే.. సూపర్‌-8 ముందు ప్రత్యర్థులకు గట్టి...

శ్రీలంకకు జింబాబ్వే ఝలక్‌

నేటి మ్యాచ్‌

ఆస్ట్రేలియా X ఒమన్‌ (రాత్రి. 7 గం. నుంచి)

కొలంబో: టీ20 వరల్డ్‌క్‌పలో జింబాబ్వే మరో సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాపై నెగ్గిన జింబాబ్వే.. ఆతిథ్య శ్రీలంకకు షాకిచ్చింది. గ్రూప్‌ దశను అజేయం గా ముగించిన జింబాబ్వే.. సూపర్‌-8 ముందు ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపింది. ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ (63 నాటౌట్‌) సమయోచిత అర్ధ శతకంతోపా టు కెప్టెన్‌ సికందర్‌ రజా (26 బంతుల్లో 45) దూకుడుగా ఆడడంతో.. గ్రూప్‌-బిలో గురువారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 178/7 స్కోరు సాధించింది. క్రీమర్‌, ఇవాన్స్‌, ముజరబాని రెండేసి వికెట్లు దక్కించుకొన్నారు. మందకొడి పిచ్‌పై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న లంకకు ఓపెనర్లు పథుం నిస్సాంక (62), కుశాల్‌ పెరీరా (22) తొలి వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. మెండి్‌సను బర్ల్‌.. నిస్సాంకను క్రీమర్‌ అవుట్‌ చేయడంతో లంక బ్యాటింగ్‌ కుదుపులకు గురైంది. ఛేదనలో జింబాబ్వే 19.3 ఓవర్లలో 182/4 స్కోరు చేసి గెలిచింది. తుదికంటా క్రీజులో నిలిచిన బెన్నెట్‌.. మొదటి వికెట్‌కు మరుమణి (34)తో, మూడో వికెట్‌కు సికందర్‌తో 69 పరుగుల చొప్పున భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో జింబాబ్వే మరో 3 బంతులు మిగిలుండగానే గెలుపుగీత దాటింది. హేమంత రెండు వికెట్లు పడగొట్టాడు.


సంక్షిప్త స్కోర్లు:

శ్రీలంక: 20 ఓవర్లలో 178/7 (నిస్సాంక 62, పవన్‌ రత్నాయకే 44; క్రీమర్‌ 2/27, ముజరబాని 2/38).

జింబాబ్వే: 19.3 ఓవర్లలో 182/4 (బెన్నెట్‌ 63 నాటౌట్‌, సికందర్‌ 45; హేమంత 2/36).

సంచలనాల వెనుక..

2024 టీ20 వరల్డ్‌క్‌పనకు అర్హత కూడా సాధించలేకపోయిన జింబాబ్వే.. ఈసారి మాజీ చాంపియన్లు ఆస్ట్రేలియా, శ్రీలంకపై పెను సంచలనాలతో వారెవా అనిపించింది. అయితే, జింబాబ్వే అనూహ్య విజయాల వెనుక 22 ఏళ్ల బ్రియాన్‌ బెన్నెట్‌ పాత్ర కీలకం. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో బెన్నెట్‌ 175 పరుగులు సాధించాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా అవుట్‌ కాకపోవడం విశేషం. ఒమన్‌తో మ్యాచ్‌లో 48 పరుగులు, ఆసీస్‌పై 64 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. ఇక, లంకపై కూడా ఎంతో పరిణతి చెందిన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకొన్నాడు.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 20 , 2026 | 05:13 AM