అభిషేక్ అదరగొట్టేనా?
ABN , Publish Date - Feb 18 , 2026 | 03:08 AM
టీ20 వరల్డ్‌క్‌పలో జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా గ్రూప్ ‘ఎ’లో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఆదివారం పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో సూర్య సేన ఇప్పటికే సూపర్-8లో అడుగుపెట్టిన విషయం...
నేటి మ్యాచ్‌లు
దక్షిణాఫ్రికా X యూఏఈ
(ఉ. 11 గం. నుంచి)
పాకిస్థాన్ X నమీబియా (మ.3 గం.)
భారత్ X నెదర్లాండ్స్ (రా.7 గం.)
జోష్‌లో టీమిండియా
నేడు నెదర్లాండ్స్‌తో మ్యాచ్
అహ్మదాబాద్: టీ20 వరల్డ్‌క్‌పలో జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా గ్రూప్ ‘ఎ’లో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఆదివారం పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో సూర్య సేన ఇప్పటికే సూపర్-8లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక పసికూన నెదర్లాండ్స్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌లో నెగ్గి గ్రూప్ దశను అజేయంగా ముగించాలనుకుంటోంది. అయితే జట్టులో ఇప్పటికీ సరిదిద్దుకోవాల్సిన లోపాలున్నాయి. ముఖ్యంగా ఈ కీలక టోర్నీలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళనపరుస్తోంది. తను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇప్పటికీ పరుగుల ఖాతా తెరవలేదు. వాస్తవానికి అతడి చివరి ఏడు ఇన్నింగ్స్‌లో నాలుగు డకౌట్లున్నాయి. ప్రతి బంతినీ బాదడమే లక్ష్యంగా ఆడుతుండడం కూడా బలహీనతగా మారింది. అలాగే తనను కట్టడి చేసేందుకు ప్రత్యర్థి జట్లు డీప్ కవర్‌లో ఫీల్డర్‌ను ఉంచి దెబ్బతీస్తున్నాయి. అందుకే అతడిని ముందుగా సింగిల్ తీసుకోమంటూ దిగ్గజ ప్లేయర్ గవాస్కర్ సలహా ఇచ్చాడు. ఏదిఏమైనా సూపర్-8కు ముందే ఈ వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ ఫామ్‌లోకి రావడం జట్టుకు అత్యంత అవసరం. అటు మరో ఓపెనర్ ఇషాన్ మాత్రం అంచనాలకు మించే రాణిస్తున్నాడు. ప్రేమదాస పిచ్‌పై తనొక్కడే దీటుగా నిలబడ్డాడు. కానీ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మిడిలార్డర్ కాస్త తడబడుతోంది. నమీబియా, పాక్ జట్లపై ఈ బలహీనత బయటపడింది. ఎరాస్మస్, తారిఖ్, సయీమ్ తమ వైవిధ్యమైన బంతులతో భారత బ్యాటర్లను కట్టడి చేశారు. ఇక స్టార్ పేసర్ బుమ్రాకు ఈ మ్యాచ్‌కు విశ్రాంతినిచ్చి సిరాజ్‌ను ఆడించే అవకాశం లేకపోలేదు. కుల్దీ్‌పను కూడా పక్కనబెట్టి అర్ష్‌దీ్‌పను బరిలోకి దించవచ్చు. వరుణ్, అక్షర్ ఇతర స్పిన్నర్లుగా ఉంటారు. మరోవైపు నెదర్లాండ్స్ జట్టు భారత్‌ను ఎదుర్కోవాలంటే శక్తికి మించిన ఆటతీరును ప్రదర్శించాల్సిందే. నమీబియాపై గెలిచాక ఈ జట్టు యూఎ్‌సఏ చేతిలో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్‌లో బాస్ డి లీడ్స్, బౌలింగ్‌లో స్పిన్నర్లు ఆర్యన్ దత్, వాన్ డర్ కీలకం కానున్నారు.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, ఇషాన్, తిలక్, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్, శివమ్ దూబే, అక్షర్, రింకూ సింగ్, సిరాజ్/బుమ్రా, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి.
నెదర్లాండ్స్: లెవిట్, ఓడౌడ్, బాస్ డి లీడ్, ఏకర్‌మన్, ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కాచెట్, లోగన్ వాన్, ఆర్యన్, వాన్ డర్ మెర్వ్, గుగ్టెన్, క్లాసెన్.
పాయింట్ల పట్టిక
గ్రూప్-బి
జట్టు మ్యా గె ఓ ర పా ర.రే
శ్రీలంక 3 3 0 0 6 2.462
జింబాబ్వే 3 2 0 1 5 1.984
ఐర్లాండ్ 4 1 2 1 3 0.150
ఆస్ట్రేలియా 3 1 2 0 2 0.414
ఒమన్ 3 0 3 0 0 -4.546
గ్రూప్-సి
జట్టు మ్యా గె ఓ పా ర.రే
వెస్టిండీస్ 3 3 0 6 1.820
ఇంగ్లండ్ 4 3 1 6 0.201
స్కాట్లాండ్ 4 1 3 2 0.184
ఇటలీ 3 1 2 2 -0.588
నేపాల్ 4 1 3 2 -1.349
గ్రూప్-డి
దక్షిణాఫ్రికా 3 3 0 6 1.477
న్యూజిలాండ్ 4 3 1 6 1.227
అఫ్ఘానిస్థాన్ 3 1 2 2 -0.215
యూఏఈ 3 1 2 2 -0.797
కెనడా 3 0 3 0 -1.865
మ్యా: మ్యాచ్‌లు; గె: గెలుపు; ఓ: ఓటమి;
పా: పాయింట్లు; ర.రే: రన్‌రేట్
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?
ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ