పాకిస్థాన్, నమీబియా మ్యాచ్‌కు వర్షం ముప్పు..
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:31 PM
టీ20 ప్రపంచకప్2026లో భాగంగా పాకిస్థాన్.. తన చివరి లీగ్ మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. ఇవాళ(బుధవారం) కొలంబో వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్2026లో భాగంగా పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్ నమీబియాతో(Pakistan vs Namibia) ఆడనుంది. ఇవాళ(బుధవారం) కొలంబో వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3.00 గంటలు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే పాక్, నమీబియా మ్యాచ్‌కు వాన గండం పొంచి ఉంది. కొలంబోలో వర్షం పడే ఛాన్స్ ఎక్కువగా ఉందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. మరి.. వర్షం పడుతుందంటే పాక్ ఫ్యాన్స్ అంతలా సంతోష పడటానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026)లో ఇప్పటికే ఏడు జట్లు సూపర్-8కు చేరాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే, గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ సూపర్-8లో అడుగుపెట్టాయి. అలానే గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ అర్హత సాధించాయి. ఇక గ్రూప్- ఏ నుంచి ఇప్పటి వరకు భారత్ మాత్రమే అధికారికంగా సూపర్-8కి చేరింది. ఇక రెండో బెర్తు కోసం అమెరికా, పాకిస్థాన్ పోటీలో ఉన్నాయి. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న అమెరికా నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని రెండు గెలిచి 4 పాయింట్లు, నెట్ రన్‌రేట్+0.787గా ఉంది. పాక్ మూడింట రెండు గెలిచి 4 పాయింట్లు, నెట్ రన్‌రేటు -0.403 గా ఉంది. పాకిస్థాన్‌కు అమెరికాతో సమానంగా పాయింట్లు ఉన్నా నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడి ప్రస్తుతానికి మూడో స్థానంలో నిలిచింది.
వర్షం పడితే...
నిన్న(మంగళవారం) పల్లెకెలెలో వాన కారణంగా జింబాబ్వే- ఐర్లాండ్(Ireland) మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. దీంతో జింబాబ్వే సూపర్-8కు చేరగా.. ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఈ క్రమంలో గ్రూప్-ఏ లో మూడో స్థానంలో ఉన్న పాకిస్థాన్ తమ చివరి లీగ్ మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. ఇవాళ జరగాల్సిన ఈ మ్యాచ్ కి కూడా వర్షం ముప్పు పొంచింది ఉంది. ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ గనుక రద్దైతే పాకిస్థాన్‌కు పండుగే. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే.. పాక్, నమీబియాలకు చెరో పాయింట్ వస్తుంది.
దీంతో ఐదు పాయింట్లతో పాకిస్థాన్ సూపర్-8కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ జరిగినా పాక్.. నమీబియాపై తప్పనిసరిగా గెలవాలి. నమీబియా పసికూనే అయినా గట్టిగా పోరాడుతుంది. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గట్టి పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక పాక్ నిలకడలేమితనం ఆ జట్టు ఫ్యాన్స్ ఆందోళనకు కారణమైంది. నమీబియా చేతిలో ఓడిన ఆశ్చర్యం లేదని కొందరు పాక్(Pakistan) అభిమానులు అంటున్నారు. ఈ కారణంగా మ్యాచ్ రద్దైతే.. నేరుగా సూపర్-8కి వెళ్లొచ్చనే భావనలో పాక్ అభిమానులు ఉన్నారు.
ఇవీ కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన యువరాజ్.. ప్రపంచ రికార్డు
ఇలాంటి సిక్స్ ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్