టీ20 ప్రపంచ కప్: ఫర్హాన్ సూపర్ సెంచరీ.. నమీబియా టార్గెట్ 200
ABN , Publish Date - Feb 18 , 2026 | 04:43 PM
పొట్టి ప్రపంచ కప్‌లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్-నమీబియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. నమీబియాకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: పొట్టి ప్రపంచ కప్‌లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్-నమీబియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్(100*; 58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. పాక్.. నమీబియాకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
పాక్ బ్యాటర్లలో సల్మాన్ అఘా(38; 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. సయాబ్ ఆయుబ్(14), ఖవాజా(5) విఫలమయ్యారు. షాదాబ్ ఖాన్(36*; 22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) నాటౌట్‌గా నిలిచాడు. నమీబియా బౌలర్లలో జాక్ బ్రెస్సేల్ 2, ఎరాస్మస్ 1 వికెట్ పడగొట్టారు. కాగా పాకిస్థాన్ సూపర్ 8కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. మరోవైపు నమీబియా జట్టు ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన యువరాజ్.. ప్రపంచ రికార్డు
ఇలాంటి సిక్స్ ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్