Share News

జట్టును గెలిపించాలన్న ఆలోచనే బాబర్ అజామ్‌కు లేదు: దినేశ్ కార్తిక్

ABN , Publish Date - Feb 18 , 2026 | 03:50 PM

పాక్ జట్టుకు సీనియర్ ప్లేయర్ బాబర్ అజామ్ ఫామ్ ఆందోళనగా మారింది. భారత్‌తో జరిగిన కీలక పోరులోనూ బాబర్ తీవ్రంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ బాబర్ అజామ్ ఫామ్‌పై స్పందించాడు.

జట్టును గెలిపించాలన్న ఆలోచనే బాబర్ అజామ్‌కు లేదు: దినేశ్ కార్తిక్
Dinesh Karthik

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 7 జట్లు సూపర్ 8కి అర్హత సాధించాయి. ప్రస్తుతం పాకిస్థాన్-నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. దీంట్లో పాక్ గెలిస్తే ఆఖరి జట్టుగా సూపర్ 8కి చేరుకుంటుంది. లేదంటే గ్రూప్ ఏలో అత్యధిక పాయింట్లతో యూఎస్ఏ తదుపరి దశకు వెళ్తుంది. అయితే టోర్నీ ఆరంభం నుంచి పాక్ జట్టుకు సీనియర్ ప్లేయర్ బాబర్ అజామ్ ఫామ్ ఆందోళనగా మారింది. భారత్‌తో జరిగిన కీలక పోరులోనూ బాబర్ తీవ్రంగా విఫలమయ్యాడు. 7 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్.. భారత్‌పై 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ బాబర్ అజామ్ ఫామ్‌పై స్పందించాడు.


‘చాలా కాలంగా బాబర్ అజామ్‌ను విరాట్ కోహ్లీతో పోల్చుతున్నారు. అది చాలా అన్యాయం. విరాట్ కోహ్లీ.. బాబర్‌లా నిర్లక్ష్యంగా షాట్లు ఆడటం నేను చూడలేదు. జట్టును గెలిపించాలన్న ఆలోచనే బాబర్‌కు లేదు. అతడు పరుగులు రాబట్టలేకపోతున్నాడు. ఒత్తిడిలో రాణించడమే గొప్ప క్రికెటర్ లక్షణం. బాబర్‌లో ఆ లక్షణమే లేదు. అత్యుత్తమ క్రికెటర్ అనిపించుకునే లక్షణాలు నేను అతడిలో చూడలేదు. అభిషేక్ శర్మ ప్రపంచంలోనే అత్యు్త్తమ క్రికెటర్ అని నేను భావిస్తున్నా’ అని దినేశ్ కార్తిక్ అన్నాడు.


ఇవి కూడా చదవండి:

చరిత్ర సృష్టించిన యువరాజ్.. ప్రపంచ రికార్డు

ఇలాంటి సిక్స్ ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్

Updated Date - Feb 18 , 2026 | 03:50 PM