Home » Dinesh Karthik
వాషింగ్టన్ సుందర్‌ను మూడో స్థానంలో ఆడించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీని వల్ల అతడి బౌలింగ్ కెరీర్ నాశనం అవుతుందని అభిప్రాయపడ్డాడు.
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌ను పాకిస్థాన్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన నిర్ణయాత్మక ఫైనల్ పోరాటంలో కువైట్‌ను ఓడించిన పాక్ ట్రోఫీ గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత్ పేలవ ప్రదర్శనను కనబరిచింది.
హాంకాంగ్ ఇంటర్నేషన్ సిక్సెస్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. పూల్-సిలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కువైట్.. నిర్ణీత ఆరు ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. 107 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. ఆరు వికెట్లు కోల్పోయి 79 పరుగులకే పరిమితమైంది.
హాంకాంగ్ సూపర్ సిక్సెస్ 2025లో భాగంగా ఇవాళ(నవంబర్ 7) ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై సంచలన విజయం నమోదు చేసింది.
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియాకు కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ వ్యవహరించనున్నాడు. నవంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో 12 జట్లు పోటీపడనున్నాయి. ఆరు ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీకి డీకే సారథ్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
టీమిండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ తనను ఊసరవెల్లిగా మార్చేశాడని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ధోని కంటే మూడు నెలల ముందు 2004లో కార్తీక్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే ధోని వచ్చిన తర్వాత జట్టులో చోటు సంపాదించడం కార్తీక్‌కు చాలా కష్టంగా మారిపోయింది.
టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ చాలా బిజీగా ఉంటున్నాడు. ఆటకు గుడ్‌బై చెప్పేసినా ఏదో ఒక రకంగా క్రికెట్‌తో రిలేషన్స్ కొనసాగిస్తున్నాడు డీకే.
ఆర్సీబీ జట్టుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు తీసిన ఈ వీడియోలో బెంగళూరు ప్లానింగ్ చేసిన తీరు చూస్తే మతి పోవాల్సిందే.
ఎవరి జీవితంలోనైనా పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. వివాహ బంధం అనేది కలకాలం నిలిచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని భావిస్తారు. కానీ కొన్ని బంధాలకు మధ్యలోనే బీటలు వారతాయి. పెళ్లైన కొన్నేళ్లకే విడిపోతుంటారు. ఇందుకు క్రికెటర్లు కూడా మినహాయింపేమీ కాదు.
Boxing Day Test: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మధ్య వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. పెర్త్ టెస్ట్ సెంచరీని మినహాయిస్తే అతడి బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు వచ్చింది లేదు. అసలు కింగ్ బ్యాట్ ఎందుకు మూగబోయిందో ఎవరికీ అంతుపట్టడం లేదు.