Share News

Dhoni vs Karthik: ధోనీ నన్ను ఊసరవెల్లిలా మార్చేశాడు.. తన కెరీర్‌పై దినేష్ కార్తీక్ ఏమన్నాడంటే..

ABN , Publish Date - Sep 09 , 2025 | 07:19 AM

టీమిండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ తనను ఊసరవెల్లిగా మార్చేశాడని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ధోని కంటే మూడు నెలల ముందు 2004లో కార్తీక్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే ధోని వచ్చిన తర్వాత జట్టులో చోటు సంపాదించడం కార్తీక్‌కు చాలా కష్టంగా మారిపోయింది.

Dhoni vs Karthik: ధోనీ నన్ను ఊసరవెల్లిలా మార్చేశాడు.. తన కెరీర్‌పై దినేష్ కార్తీక్ ఏమన్నాడంటే..
Dinesh Karthik interview

టీమిండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తనను ఊసరవెల్లిగా మార్చేశాడని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. ధోని కంటే మూడు నెలల ముందు 2004లో కార్తీక్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే ధోని వచ్చిన తర్వాత జట్టులో చోటు సంపాదించడం కార్తీక్‌కు చాలా కష్టంగా మారిపోయింది. వికెట్, కీపర్ బ్యాటర్‌గా ధోనీ తనదైన ముద్ర వేశాడు. దీంతో అదే పాత్ర పోషించే కార్తీక్ అవసరం పెద్దగా లేకుండా పోయింది (Dinesh Karthik interview).


తన కెరీర్ ఆరంభ రోజులను దినేష్ కార్తీక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. 'ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్ వికెట్ కీపింగ్ చేసేవాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని ద్రవిడ్ అనుకున్నాడు. దాంతో జట్టుకు శాశ్వత వికెట్ కీపర్ అవసరం ఏర్పడింది. ఆ అవకాశం నాకు కొద్ది రోజులు మాత్రమే వచ్చింది. ధోనీ రాకతో అంతా మారిపోయింది. ధోనీని అందరూ గ్యారీ సోబర్స్‌తో పోల్చేవారు. దాంతో నాకు అవకాశాలు వచ్చేవి కాదు' అని కార్తీక్ అన్నాడు (Dhoni vs Karthik).


'ధోనీ నాకు చాలా నేర్పించాడు. ప్రత్యక్షంగా కాదు.. పరోక్షంగా. ధోనీ ఉండగా జట్టులో చోటు సంపాదించడం కోసం ఊసరవెల్లిలా మారిపోయా. జట్టులో ఓపెనర్‌కు స్థానం ఉంటే, నేను ఓపెనింగ్ చేశాను. మిడిల్ ఆర్డర్‌లో అవసరమైతే, అక్కడ బ్యాటింగ్ చేశాను. కెరీర్ చివరి సంవత్సరాల్లో 6, 7 స్థానాల్లో కూడా బ్యాటింగ్ చేసాను చాలా ఒత్తిడి ఉండేది. చాలాసార్లు ఒత్తిడిలో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాన'ని కార్తీక్ అన్నాడు. టీమిండియా తరఫున దినేష్ కార్తీక్ మొత్తం 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు.


ఇవి కూడా చదవండి..

చేతిలో గన్.. ఛేజింగ్.. సరికొత్త అవతారంలో ధోనీ.. టీజర్ అదిరిపోయిందిగా..

ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్‌ యాప్‌ కేసులో విచారణ..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 09 , 2025 | 07:19 AM