MS Dhoni Action avatar: చేతిలో గన్.. ఛేజింగ్.. సరికొత్త అవతారంలో ధోనీ.. టీజర్ అదిరిపోయిందిగా..
ABN , Publish Date - Sep 08 , 2025 | 06:48 AM
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో సరికొత్త అవతారంలో అభిమానులకు కనువిందు చేయబోతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన ధోనీ ఐపీఎల్ మాత్రం ఆడుతున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ధోనీ, ఆడతాడా లేదా అనే సందిగ్ధంలో ఉన్న అభిమానులకు తాజాగా అదిరిపోయే షాకిచ్చాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో సరికొత్త అవతారంలో అభిమానులకు కనువిందు చేయబోతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన ధోనీ ఐపీఎల్ మాత్రం ఆడుతున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ధోనీ, ఆడతాడా లేదా అనే సందిగ్ధంలో ఉన్న అభిమానులకు తాజాగా అదిరిపోయే షాకిచ్చాడు. తాజాగా నటుడు మాధవన్ షేర్ చేసిన వీడియోలో ధోనీ అదిరిపోయే యాక్షన్ హీరోగా కనిపించాడు (Madhavan Dhoni project).
ప్రముఖ దర్శకుడు వాసన్ బాలా కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన టీజర్ ది ఛేజ్ (The Chase teaser)ను మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో ధోనీ అదిరిపోయే యాక్షన్ హీరోలా స్టంట్స్ చేశాడు. కమాండో యూనిఫాంలో, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని, చేతిలో గన్ పట్టుకుని బుల్లెట్ల వర్షం కురిపించాడు. మాధవన్, ధోనీ టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్స్‌గా కనబడుతున్నారు. 'ఒక మిషన్. ఇద్దరు ధైర్యవంతులు. రెడీగా ఉండండి, ఒక యాక్షన్ ఛేజ్ ప్రారంభం కానుంది' అని ఆ వీడియో చివర్లో పేర్కొన్నారు (MS Dhoni acting debut).
ఈ టీజర్ చూసిన అభిమానులు థ్రిల్‌కు గురవుతున్నారు (Dhoni Madhavan collab). అయితే ఇది సినిమానా, వెబ్ సిరీస్‌నా లేదా ఏదైనా ప్రమోషనల్ యాడ్‌నా అనే విషయంలో పూర్తి క్లారిటీ లేదు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన ధోనీ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియో విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయింట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..