Dinesh Karthik: కెప్టెన్‌గా డీకే..!
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:43 PM
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియాకు కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ వ్యవహరించనున్నాడు. నవంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో 12 జట్లు పోటీపడనున్నాయి. ఆరు ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీకి డీకే సారథ్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: చైనాలోని మోంగ్ కాక్ వేదికగా నవంబర్ 6 నుంచి హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ పొట్టి టోర్నీలో టీమిండియాకు మాజీ స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ నాయకత్వం వహించనున్నాడు. ఈ క్రమంలో తాజాగా భారత్ తమ జట్టును ప్రకటించింది.
ఆరు ఓవర్లే..
దినేశ్ కార్తీక్(Dinesh Karthik)తో పాటు వెటరన్ ప్లేయర్లు రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్‌లు ఈ హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీలో భాగం కానున్నారు. వీరితో పాటు దేశీ వెటరన్ క్రికెటర్ ప్రియాంక పాంచల్ కూడా పాల్గొననున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్(Hong Kong Cricket Sixes) టోర్నీలో.. ఒక్కో టీమ్‌లో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఆరు ఓవర్ల పాటు ఆట సాగుతుంది. ఇక ఈ పొట్టి టోర్నీలో టీమిండియా(Team India) 2005లో టైటిల్ గెలిచింది. మరో రెండు సార్లు రన్నరప్‌గా నిలిచింది. అయితే గతేడాది రాబిన్ ఊతప్ప కెప్టెన్సీలో టీమిండియా కనీసం ఫైనల్ కూడా చేరలేదు. ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీతో ఈ టోర్నీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
12 జట్లు..
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, నేపాల్, ఇంగ్లండ్, యూఏఈ, కువైట్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్(చైనా), ఈ టోర్నీలో భాగం కానున్నాయి. పూల్ ఏ నుంచి సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, నేపాల్.. పూల్ బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, యూఏఈ, పూల్ సి నుంచి భారత్, పాకిస్తాన్, కువైట్.. పూల్ డీ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ తలపడనున్నాయి.
అరుదైన గౌరవం..
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడంపై డీకే మాట్లాడాడు. ‘హాంకాంగ్ సిక్సెస్‌లో టీమిండియాకు సారథ్యం వహించనుండటం నిజంగా నాకు దక్కిన అరుదైన గౌరవం. ఈ టోర్నీకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది’ అని డీకే వెల్లడించాడు. ‘అద్భుతమైన రికార్డులు కలిగిన ఆటగాళ్ల బృందానికి నాయకత్వం వహించడానికి నేను ఎదురు చూస్తున్నా. అభిమానులకు ఆనందం, వినోదం అందించేలా ఫియర్ లెస్ క్రికెట్ ఆడటం మనందరం కలిసి లక్ష్యంగా పెట్టుకుందాం’ అని క్రికెట్ హాంకాంగ్ చైనా ఛైర్‌పర్సన్ బుర్జీ ష్రాఫ్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి