Dinesh Karthik: భార్య చేతిలో తిట్లు.. నవ్వులు తెప్పిస్తున్న దినేష్ కార్తీక్!
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:05 PM
టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ చాలా బిజీగా ఉంటున్నాడు. ఆటకు గుడ్‌బై చెప్పేసినా ఏదో ఒక రకంగా క్రికెట్‌తో రిలేషన్స్ కొనసాగిస్తున్నాడు డీకే.
టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ క్రికెట్‌కు గతేడాది గుడ్‌బై చెప్పేశాడు. అయితే కామెంట్రీ ఇవ్వడంతో పాటు ఆర్సీబీకి మెంటార్‌గా ఉంటూ జెంటిల్మన్ గేమ్‌తో ఇంకా రిలేషన్స్ కొనసాగిస్తున్నాడు. క్యాష్ రిచ్ లీగ్-2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి మెంటార్‌గా సేవలందించిన డీకే.. ఆ జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. మెగా ఆక్షన్ దగ్గర నుంచి కప్పు కొట్టే క్షణం వరకు ఆర్సీబీ ప్రతి అడుగులో కార్తీక్ ముఖ్య భూమిక పోషించాడు. ఐపీఎల్ అయిపోయినా డీకే ప్రతిభ గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో భార్య చేతిలో తిట్లు పక్కా అంటూ ఓ ఆసక్తికర పోస్ట్‌తో అందరి దృష్టిని మరోమారు తనవైపునకు తిప్పుకున్నాడతను. మరి.. ఆ పోస్ట్‌లో ఏం ఉందో ఇప్పుడు చూద్దాం..
దీపిక ఆవలింతలు..
సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు కార్తీక్ హాజరయ్యాడు. కామెంట్రీ బాక్స్‌లో హుషారుగా మాట్లాడుతూ, ఆటను విశ్లేషిస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌కు డీకే సతీమణి దీపికా పల్లికల్ కూడా హాజరైంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలసి దిగిన పలు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు డీకే. ఇందులోని ఒక ఫొటోలో కార్తీక్-దీపిక ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. అయితే మరో సెల్ఫీలో డీకే కెమెరా వైపు సీరియస్‌గా చూస్తుండగా.. దీపిక ఆవలింతలు పెడుతూ కనిపించింది.

తిట్టక ఊరుకుంటారా..
దీపికా-దినేష్ వెర్షన్ అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చిన డీకే.. తన సతీమణి గానీ వీటిని చూస్తే తనను ద్వేషించడం ఖాయమని, తిట్లు తప్పవని రాసుకొచ్చాడు. ఇవి చూసిన నెటిజన్స్.. దినేష్ కార్తీక్ నవ్వులు తెప్పిస్తున్నాడని, ఆవలింతల ఫొటోలు పెడితే ఎవరు ఊరుకుంటారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ ఫొటోలతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కామెంట్రీతో ఆకట్టుకున్న లెజెండ్ సునీల్ గవాస్కర్, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితోనూ దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్నాడు డీకే.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి