Share News

అవి చీకటి రోజులు

ABN , Publish Date - Jun 17 , 2025 | 01:58 AM

లండన్‌: గత దేశవాళీ సీజన్‌లో పరుగుల వరద పారించిన కరుణ్‌ నాయర్‌కు ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత జాతీయ జట్టులో చోటు లభించింది. ఈ నేపథ్యంలో...

అవి చీకటి రోజులు

న్యూఢిల్లీ: లండన్‌: గత దేశవాళీ సీజన్‌లో పరుగుల వరద పారించిన కరుణ్‌ నాయర్‌కు ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత జాతీయ జట్టులో చోటు లభించింది. ఈ నేపథ్యంలో తన క్రికెట్‌ కెరీర్‌లో ఎత్తుపల్లాలను తలుచుకుంటూ 33 ఏళ్ల నాయర్‌ ఉద్వేగానికి గురయ్యాడు. ‘2022 ఏడాది చివరి రోజులు నా కెరీర్‌లో అత్యంత చీకటిమయం’ అని ఆర్‌.అశ్విన్‌ యూట్యూబ్‌ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నాయర్‌ తెలిపాడు. దేశవాళీ పోటీల్లో సత్తా చాటినా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైన కరుణ్‌.. ‘డియర్‌ క్రికెట్‌. నాకు మరో అవకాశం ఇవ్వు’ అంటూ 2022 డిసెంబరులో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం సంచలనం రేపింది. ‘గత రెండు మూడు సంవత్సరాలుగా నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. ఈ సమయంలో ప్రతి క్షణం ఎంత విలువైనదో తెలుసుకున్నా. దాంతో ప్రతి రోజును కొత్తగా భావించా’ అని కరుణ్‌ తెలిపాడు. సెహ్వాగ్‌ తర్వాత టెస్ట్‌ల్లో త్రిశతకం బాదిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కిన నాయర్‌ను 2018లో ఎలాంటి కారణం చూపకుండా టీమిండియానుంచి తప్పించడం గమనార్హం.

ఇవీ చదవండి:

ఇంగ్లండ్‌కు జడేజా భయం

బుమ్రా-గిల్ అదిరిపోయే స్కెచ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 01:58 AM