Share News

టీ20 ప్రపంచ కప్: నమీబియా 97 పరుగులకు ఆలౌట్.. సూపర్ 8కు పాకిస్థాన్

ABN , Publish Date - Feb 18 , 2026 | 06:21 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా జట్టు.. 17.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది.

టీ20 ప్రపంచ కప్: నమీబియా 97 పరుగులకు ఆలౌట్.. సూపర్ 8కు పాకిస్థాన్
T20 World Cup

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా జట్టు.. 17.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పాకిస్థాన్ జట్టు సూపర్ 8కి అర్హత సాధించింది.


పాక్ బౌలర్ల ధాటికి నమీబియా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. స్టీక్యాంప్(23) టాప్ స్కోరర్. అలెగ్జాండర్(20) పరుగులు చేశాడు. ఇతర బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ 4 వికెట్లు తీసి నమీబియా పతనాన్ని శాసించాడు. షాదాబ్ ఖాన్ 3, సల్మాన్ మిర్జా, నవాజ్ తలొక వికెట్ తీశారు.


అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్(100*; 58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. సల్మాన్ అఘా(38; 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. సయాబ్ ఆయుబ్(14), ఖవాజా(5) విఫలమయ్యారు. షాదాబ్ ఖాన్(36*; 22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) నాటౌట్‌గా నిలిచాడు. నమీబియా బౌలర్లలో జాక్ బ్రెస్సేల్ 2, ఎరాస్మస్ 1 వికెట్ పడగొట్టారు. మరోవైపు నమీబియా జట్టు ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్‌: ఫర్హాన్ సూపర్ సెంచరీ.. నమీబియా టార్గెట్ 200

జట్టును గెలిపించాలన్న ఆలోచనే బాబర్ అజామ్‌కు లేదు: దినేశ్ కార్తిక్

Updated Date - Feb 18 , 2026 | 06:21 PM