టీ20 ప్రపంచ కప్: పోరాడి ఓడిన నెదర్లాండ్స్.. భారత్ విజయం
ABN , Publish Date - Feb 18 , 2026 | 10:51 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో గెలుపొందింది. నెదర్లాండ్స్ జట్టు ఆఖరి వరకు పోరాడి ఓడింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో గెలుపొందింది. నెదర్లాండ్స్ జట్టు ఆఖరి వరకు పోరాడి ఓడింది. 194 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన నెదర్లాండ్స్.. నిర్ణీత 20 ఓవర్లకు 7వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆఖరిలో క్రోస్(25*; 12 బంతుల్లో 5 ఫోర్లు) బౌండరీలతో మెరిశాడు.
నెదర్లాండ్స్ బ్యాటర్లలో బాస్ డీ లీడె(33) టాప్ స్కోరర్. లెవిట్(24), మ్యాక్స్(20), అకెర్‌మ్యాన్(23), ఎడ్వర్డ్స్(15), లయన్(26), క్రోస్(25*), వాన్ బీక్(4*) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, దూబే 2, బుమ్రా, హార్దిక్ పాండ్య తలొక వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. శివం దూబే(66;31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తిలక్ వర్మ(31), సూర్యకుమార్ యాదవ్(34), హార్దిక్ పాండ్య(30) రాణించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్ 3, ఆర్యన్ దత్ 2, క్లీన్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: ఫర్హాన్ సూపర్ సెంచరీ.. నమీబియా టార్గెట్ 200
జట్టును గెలిపించాలన్న ఆలోచనే బాబర్ అజామ్‌కు లేదు: దినేశ్ కార్తిక్