టీ20 ప్రపంచ కప్: మైఖెల్ జోన్స్ హాఫ్ సెంచరీ.. నేపాల్ టార్గెట్ 171
ABN , Publish Date - Feb 17 , 2026 | 08:52 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నేపాల్-స్కాట్లాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నేపాల్-స్కాట్లాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. నేపాల్ జట్టుకు 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్కాట్లాండ్ ఓపెనర్ మైఖెల్ జోన్స్(71; 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
జార్జ్ మున్సీ(27), బ్రాండన్ మెక్‌ముల్లన్(25) పర్వాలేదనిపించారు. రిచీ బెర్రింగ్టన్(10), టామ్ బ్రూసీ(5), మాథ్యూ క్రాస్(4), లీస్క్(4) విఫలమయ్యారు. మార్క్ వాట్(10*), డేవిడ్‌సన్(1*) నాటౌట్‌గా నిలిచారు. కాగా నేపాల్ బౌలర్లలో సోంపాల్ కమీ 3, నందన్ యాదవ్ 2, రోహిత్ పాడేల్, కుషల్ చెరొక వికెట్ పడగొట్టారు. కాగా స్కాట్లాండ్, నేపాల్ జట్లు ఇప్పటికే గ్రూప్ స్టేజి నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నామమాత్రపు మ్యాచుల్లో ఇరుజట్లు తలపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?
ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ