Share News

ఓవర్ నైట్‌ స్టార్ ఐరా రావత్.. ఇంతకీ ఈమె ఎవరంటే?

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:40 PM

ఐరా రావత్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు. స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫొటో వైరల్ అవ్వడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇంతకీ ఈమె ఎవరంటే..

ఓవర్ నైట్‌ స్టార్ ఐరా రావత్.. ఇంతకీ ఈమె ఎవరంటే?
Ira Rawat

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా రాజ్యాలేలుతోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్‌ ఉంటే చాలు.. రకరకాల ప్రయోగాలు చేసి వైరల్ అవ్వడం నేటి ట్రెండ్. ఫాలోవర్లను పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంటారు కూడా. కొన్నిసార్లు వంద మందిని ఆకర్షించడం కూడా కష్టమే. అలాంటిది ఈ అమ్మాయి మాత్రం అనూహ్యంగా ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది. ఆమె ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా 3 వేల నుంచి 3 లక్షల 50 వేలకు పెరిగింది. ఆమె పేరే ‘ఐరా రావత్’.

16-2.jpg


16-7.jpg

మరి ఈ ఐరా ఓవర్ నైట్‌లో స్టార్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ వీక్షించింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అంతే తెల్లారేసరికి వైరల్ అయిపోయింది. ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. రాత్రికి రాత్రే ఇన్‌స్టా సెన్సేషన్ అయింది. అయితే ఇక్కడే ఓ జిమ్మిక్కు ఉంది.. ఆమె నిజం కాదట. అదంతా ఏఐ మాయేనట. ‘ఐరా రావత్’ ఇన్‌స్టా ఐడీలో పోస్ట్ చేసిన అమ్మాయి వీడియోలు కృతిమ మేధతో సృష్టించినవి. ఆమె పేరులోనూ ‘ఏఐ’ ఉండటంతో పాటు ఆమె ప్రొఫైల్‌ను క్లిక్ చేస్తే ఈ విషయం అర్థమవుతోంది.

16-3.jpg


ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తూ షేర్ చేస్తున్నారు. అయితే ఐరా ఇన్‌స్టా ఐడీలో ఇంతకుముందు కూడా స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తున్నట్లు పలు ఫొటోలు ఉన్నాయి. ఐరా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లకు వీరాభిమాని అంటూ పేర్కొన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

16-6.jpg


16-8.jpg


ఇవి కూడా చదవండి:

ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

Updated Date - Feb 16 , 2026 | 03:37 PM