Share News

టీ20 ప్రపంచ కప్ 2026: సోహైబ్ ఖాన్ హాఫ్ సెంచరీ.. అఫ్గానిస్తాన్ టార్గెట్ 161

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:01 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అఫ్గానిస్తాన్-యూఏఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.

టీ20 ప్రపంచ కప్ 2026: సోహైబ్ ఖాన్ హాఫ్ సెంచరీ.. అఫ్గానిస్తాన్ టార్గెట్ 161
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అఫ్గానిస్తాన్-యూఏఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ జట్టుకు 161 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు. సోహైబ్ ఖాన్(68; 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.


సోహైబ్ ఖాన్‌తో కలిసి అలీషాన్ షరాఫు(40) జట్టును ముందుకు నడిపించాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 57 బంతుల్లో 84 పరుగులు జోడించారు. మిగతా బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలబడలేకపోయారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 4 వికెట్లు తీసి యూఏఈ పతనాన్ని శాసించాడు. ముజీబుర్ రెహమాన్ 2, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

కుల్దీప్ యాదవ్‌పై హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ ఆగ్రహం!.. వీడియో వైరల్

Updated Date - Feb 16 , 2026 | 01:01 PM